Four Constellations Dangerous : కొంతమంది ఎక్కడున్నా పర్వాలేదు. వారు తమ నిజాయితీకి కట్టుబడి ఉండటం అలవాటుగా చేసుకుంటారు. వారు కలలో కూడా ఎవరికి అపకారం చేయరు. కానీ 12 రాశులలో కొన్ని రాశుల వారి స్వభావం ఎల్లప్పుడూ ప్రజల దృష్టిపైనే ఆధారపడి ఉంటుంది. వారు రెండు ముఖాలు, స్వభావాలు కలిగి కపట దారిని ఎంచుకుంటు మోసపూరిత ఆలోచనలతో ఉంటారు. వీరు తరచూ ఒక విషయాన్ని ప్రోత్సహిస్తారు.. దానికి విరుద్దంగా మరో దానిని అభ్యసిస్తారు. వీరు అత్యంత ప్రమాదకరం. వీరు ఏ రాశుల వారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మిధున రాశి..
ఈ రాశి వారు నైతికత, విలువలను పాటించడానికి ప్రయత్నిస్తారు కానీ చివరకు వదిలిపెడతారు. తన ఆదర్శాలను వదిలిపెట్టి ఉన్నత స్థాయికి చేరుకునే సామర్థ్యం వీరికి లేదు. మోసం, గొడవలు,వాగ్వాదాలతో ఉంటుంది వీరి జీవితం. వీరు ఎవరి నమ్మకాన్నయినా వమ్ము చేస్తారు.
2. వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు ఎవరికైనా రెండో అవకాశం ఇవ్వరు. ఏ విషయమైనా క్షమించలేరు మరచిపోలేరు. ఎవరైనా తమ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు వారిని అసలు క్షమించరు. కానీ వారు మాత్రం ఎవరికైనా ద్రోహం చేసినప్పుడు తమను క్షమించి అర్థం చేసుకోవాలని ఆశిస్తారు.
3. ధనుస్సు రాశి..
ఈ రాశివారు మోసాలకు ఎక్కువగా పాల్పడుతారు. ఉద్ధేశ్య పూర్వకంగా ఎవరిని ఇబ్బందిపెట్టరు. తరచుగా రెండు విధాలుగా ఆలోచన రీతి ఉంటుంది. ఎందుకంటే నిజాయితి అంటూ మడి కట్టుకొని కూర్చోరు. సందర్భాన్ని బట్టి వారి అసరాల రీత్యా అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడానికి వెనుకాడరు.
4. కుంభం రాశి..
కుంభ రాశివారు ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ.. ప్రతి ఒక్కరి భావాలను పట్టించుకుంటారు. వారిని లోతుగా అంచనా వేస్తారు. ఎదుటి వారికంటే అన్నివిధాలుగా తామే గొప్పని అనుకుంటారు.. అవసరాల కోసం బాగా నటిస్తారు కానీ ఇది వారి అవసరాల కనుగుణంగా మాత్రమే చేస్తారు.