Kashi: పదేళ్ల తర్వాత కాశి విశ్వేశ్వరుడిని దర్శించుకున్న నీతా అంబానీ, తనయుడి పెళ్ళికి ఆదిదంపతులకు ఆహ్వానం.. 2. 5 కోట్లు విరాళం..

|

Jun 25, 2024 | 7:10 AM

నీతా అంబానీ.. అనంత్, రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి వారణాసికి వచ్చినట్లు చెప్పారు. నీతా మొదట కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని స్వామివారి పాదాల వద్ద పెళ్లి కార్డు ఉంచి ఆహ్వానించారు. కాశీలో జరుగుతున్న అభివృద్ధి పనులను నీతా అంబానీ అభినందించారు. నమో ఘాట్‌, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. శివయ్యను దర్శనం చేసుకుని పూజలు చేసిన తర్వాత.. నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా హారతిలో పాల్గొనడం ఓ దివ్య అనుభవంగా అభివర్ణించారు. పెళ్లికి గంగామాతను కూడా ఆహ్వానించారు

Kashi: పదేళ్ల తర్వాత కాశి విశ్వేశ్వరుడిని దర్శించుకున్న నీతా అంబానీ, తనయుడి పెళ్ళికి ఆదిదంపతులకు ఆహ్వానం.. 2. 5 కోట్లు విరాళం..
Nita Ambani Visits Kashi
Follow us on

ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మ్రోగానున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ ని పెళ్లి చేసుకునే శుభ ముహర్తం దగ్గర పడుతోంది. అయితే ముఖేష్ అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం జరిగే ముందు తప్పనిసరిగా కాశీ విశ్వనాథుడి దర్శించుకుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపధ్యంలో తన ముద్దుల తనయుడి పెళ్ళి పనుల ప్రారంభానికి ముందు నీతా అంబానీ స్వయంగా సోమవారం వారణాశికి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ దేవాలయంలో శివయ్యకు పూజలు చేశారు. తన కుమారుడి వివాహానికి ఆదిదంపతుల కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వనాథ ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలసి గులాబీ రంగు చీరలో కాశీ చేరుకున్న నీతా అంబానీ..కాశీ విశ్వనాథ ఆలయంలో అనంత్ పెళ్లి కార్డును అందించారు. పూజ అనంతరం గంగామాత హారతిని కూడా వీక్షించారు. అలాగే గంగామాతకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందించారు.

10 సంవత్సరాల తర్వాత కాశీకి వచ్చిన నీతా

నీతా అంబానీ కాశీకి చేరుకున్న సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నీతా అంబానీ తన చార్టర్ విమానంలో సాయంత్రం 5:30 గంటలకు వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి విశ్వేశ్వరుడిని, పార్వతిని ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నీతా అంబానీ.. అనంత్, రాధికల వివాహ ఆహ్వాన పత్రికను శివయ్యకు అందించడానికి వారణాసికి వచ్చినట్లు చెప్పారు. నీతా మొదట కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని స్వామివారి పాదాల వద్ద పెళ్లి కార్డు ఉంచి ఆహ్వానించారు. కాశీలో జరుగుతున్న అభివృద్ధి పనులను నీతా అంబానీ అభినందించారు. నమో ఘాట్‌, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

పదేళ్ల తర్వాత కాశీకి వచ్చానని నీతా అంబానీ చెప్పారు. ఇక్కడ చోటుచేసుకున్న మార్పులు, పరిశుభ్రత చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శివయ్యను దర్శనం చేసుకుని పూజలు చేసిన తర్వాత.. నీతా అంబానీ గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా హారతిలో పాల్గొనడం ఓ దివ్య అనుభవంగా అభివర్ణించారు. పెళ్లికి గంగామాతను కూడా ఆహ్వానించారు

మొత్తం 2.5 కోట్లు విరాళం

నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న తర్వాత కాశీ విశ్వనాథ్ ధామ్‌కు రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు ప్రాంగణంలోని విశాలాక్షి శక్తి పీఠాన్ని, అన్నపూర్ణదేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్లకు పూజలను చేశారు. అంతేకాదు తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కూడా అందించారు. అన్నపూర్ణ ఆలయానికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.

రాధిక పెళ్లి దుస్తులను తయారు చేస్తున్న బనారస్ నేత కార్మికులు

అనంత్, రాధిక పెళ్లి దుస్తులను మనీష్ మల్హోత్రా సిద్ధం చేస్తున్నాడు. బనారస్‌కు చెందిన కొంతమంది చేనేత నేత కార్మికులు కూడా ఈ దుస్తులను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అందుకే మనీష్ మల్హోత్రా కూడా నీతా అంబానీతో కలిసి కాశీ చేరుకున్నాడు. నీతా అంబానీ బనారస్‌లోని కొంతమంది చేనేత కార్మికులను కూడా కలిశారు.

జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. జూలై 12న ప్రారంభమయ్యే వివాహ వేడుక మూడు రోజుల పాటు అంటే జూలై 14 వరకు జరగనుంది. జులై 12వ తేదీన తొలిరోజు కళ్యాణం జరగనుంది. జూలై 13న పవిత్రమైన ఆశీర్వాద కార్యక్రమం ఉంటుంది. జూలై 14న రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..