Capricorn: మకర రాశి వ్యక్తులు చాలా వరకు తమను తాము నియంత్రించుకుంటారు. అందరితో కలివిడిగా, స్నేహంగా, సంతోషంగా మెలుగారు. అయితే, సరదాగా ఉంటున్నారు కదా అని, ఆ రాశి వారికి అన్నీ చెప్పేయకూడదు. వారికి చెప్పకూడని, సూచించకూడని విషయాలు కొన్ని ఉన్నాయంటున్నారు జ్యోతిష్య పండితులు. అలాంటి విషయాలు వారితో షేర్ చేసుకుని వారి ఆగ్రహానికి గురి కావడం తప్ప మరేమీ ఉండదంటున్నారు. మరి మకరరాశి వారికి చెప్పకూడని విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది తప్పు అని వారికి చెప్పొద్దు..
మకరరాశి వారు తమ తప్పును ఎప్పటికీ అంగీకరించదు. వారు ఏదైనా తప్పు చేసినప్పుడు కొంత దూరం పాటించండి. అలా వారికి ఆటోమాటిక్‌గా అర్థమయ్యేలా పరోక్షంగా తెలియజేయాలి. వారు తాము చేసిన తప్పేంటో గ్రహించగల ఏకైక మార్గం ఇదే.
మానసిక పరిస్థితి బాలేనప్పుడు ఇలా చేయండి..
మకర రాశి వారు కోపంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉండండి. వారంతట వారే శాంతించేలా చూడండి. కాదని వారి జోలికి వెళితే.. వారి నుంచి వచ్చే రియాక్షన్‌కు మీరే బాధపడాల్సి వస్తుంది.
అబద్ధం చెప్పొద్దు..
ఈ రాశి వారికి అబద్ధం అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే వీరు సహజంగా ఉంటారు. మీరు చెప్పే అబద్ధాలను సులభంగా పసిగడతారు. ఒకవేళ మీరు అబద్ధాం చెప్పారని వారు గ్రహిస్తే.. వారు మిమ్మల్ని ఏమీ అనరు. కానీ, వారి ప్రవర్తనలో చాలా తేడాలు చూపిస్తారు. అందుకే.. మకర రాశి వారితో సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉండండి.
నువ్వు అవసరం లేదు అని చెప్పేముందు.. వందసార్లు ఆలోచించుకోండి..
మకరరాశి వారికి నువ్వు అవసరం లేదని చెప్పాలని భావిస్తున్నారా? అయితే ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి. మీరు చెబితే స్పాట్ రియాక్షన్ ఉంటుంది. వారు కూడా మీరు అవసరం లేదనే భావనను వెంటనే తీసుకుంటారు. ఇక వారి నిర్ణయం చాలా గట్టిగా ఉంటుంది. ఆ తరువాత ఎంత ప్రాధేయపడినా.. తిరిగి చేరువకారు.
పని గురించి మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం..
మకర రాశి వారితో పని గురించి మాట్లాడే ముందు జాగ్రత్త వహించాలి. వ్యక్తిత్వాన్ని అవమాన పరిచేలా మాట్లడకూడదు. వారికంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని అస్సలు వదిలిపెట్టరు.
మీ గురించి గొప్పలు చెప్పుకోవద్దు..
మకర రాశి వారి ముందు గొప్పలు చెప్పుకోకండి. ఎందుకంటే.. ఆ వైఖరిని వారు అస్సలు ఇష్టపడరు. కాబట్టి.. సరదాగా ముచ్చటించండి. తప్పులేదు కానీ, నేనే గొప్ప.. నేను అది చేస్తా.. ఇది చేస్తానని గొప్పలు పోవద్దు.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంథాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.
Also read:
Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..
Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..