
సహజంగానే చిన్న పిల్లలు దిష్టికి గురయ్యే అవకాశం ఎక్కువ. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న పిల్లలకు దిష్టి తగిలే అవకాశం ఉందని జ్యోతిష్యం చెబుతుంది. ఈ సమస్య నుండి పిల్లలను రక్షించడానికి జ్యోతిష్యం సూచించిన 5 సులభ నివారణలు ఇప్పుడు చూద్దాం. మీ పిల్లలు దిష్టి ప్రభావానికి గురైతే, వారు చిరాకు, విచారం లేదా తేలికపాటి జ్వరం లాంటి సంకేతాలు చూపవచ్చు. అటువంటి పరిస్థితులలో, ఈ నివారణలు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు.
నీరు, తాజా పువ్వులు నింపిన రాగి పాత్రను తీసుకోవాలి. దానిని పిల్లల తల చుట్టూ 7 లేదా 11 సార్లు తిప్పాలి. తర్వాత ఆ నీటిని కుండలో లేదా మొక్క దగ్గర పోయాలి.
చిటికెడు ఉప్పు తీసుకుని దానిని పిల్లల తల చుట్టూ ఏడు సార్లు తిప్పాలి. తర్వాత ఆ ఉప్పును టాయిలెట్ నీళ్లలో వేయాలి. ఇది నజర్ దోషం ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఎండు మిరపకాయలు, ఆవాలు తీసుకోవాలి. వాటిని పిల్లల తల చుట్టూ తిప్పాలి. ఆ తర్వాత వాటిని నిప్పు కణాలపై లేదా బహిరంగ మంటపై కాల్చాలి. కాల్చేటప్పుడు ఘాటైన వాసన వస్తే, అంతా బాగా ఉన్నట్లు అర్థం. వాసన రాకపోతే, పిల్లలకు దిష్టి తగిలిందని నమ్ముతారు.
మీ పిల్లలకు పదేపదే దిష్టి తగులుతుంటే, శనివారం రోజు హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. ఆంజనేయుడి విగ్రహం నుండి కొద్దిగా సింధూరం తీసుకుని ప్రతిరోజూ పిల్లల నుదుటిపై రాయాలి. ఇది దిష్టి ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పటిక, ఆవాలు తీసుకుని పిల్లల తల చుట్టూ ఏడు సార్లు తిప్పాలి. ఆ తర్వాత వాటిని గ్యాస్ మంటపై కాల్చాలి. ఇది నజర్ దోషం ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుందని నమ్మకం.
గమనిక: ఈ కథనంలోని సమాచారం, నివారణలు కేవలం సాంప్రదాయ నమ్మకాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించబడినవి. దయచేసి ఎప్పుడూ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోండి.