AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఇవే.. నవరాత్రుల్లో పూజిస్తే దుర్గమ్మ అనుగ్రహం మీ సొంతం

శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. పురాణ గ్రంథాల ప్రకారం ఒకొక్క దేవతకు ఒకొక్క పువ్వు అంటే ఇష్టం. ఈ నేపధ్యంలో నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పించడం వల్ల భక్తుడికి అదృష్టం, శ్రేయస్సు, సానుకూల శక్తి లభిస్తుంది. అందుకే నవరాత్రి సమయంలో పువ్వులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పువ్వులు దేవత ఆశీర్వాదాలను ఆకర్షించే సాధనం.

Navaratri 2025: అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఇవే.. నవరాత్రుల్లో పూజిస్తే దుర్గమ్మ అనుగ్రహం మీ సొంతం
Navaratri Puja
Surya Kala
|

Updated on: Sep 19, 2025 | 12:55 PM

Share

ఈ సంవత్సరం శరన్నవరాత్రి వేడుకలను జరుపుకునే సమయం ఆసన్నం అయింది. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అయితే అమ్మవారి స్వరూపంగా భావించి పూజించే ఒకొక్క దేవతకు ఒకొక్క పువ్వు అంటే ఇష్టం. నవరాత్రి తొమ్మిది రోజులలో భక్తులు ఒకొక్క రోజున ఒకొక్క దేవత స్వరుపని పూజిస్తారు. ఆ అమ్మవారికి ఇష్టమైన రంగుల దుస్తులు ధరిస్తారు. నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంతేకాదు.. అమ్మవారికి ఇష్టమైన పువ్వులను సమర్పిస్తే.. కూడా అదృష్టం, శ్రేయస్సు పొంది.. కష్టాల నుంచి విముక్తిని పొందుతారు. ఈ రోజు తొమ్మిది దేవతలకు ఇష్టమైన తొమ్మిది పువ్వులు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

  1. మొదటి రోజు శైలపుత్రి: నవరాత్రి శైలపుత్రి పూజతో ప్రారంభమవుతుంది. తెల్లటి కమలం లేదా తెల్లటి పువ్వును సమర్పించడం ఆమెను పూజించడానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఈ రంగు పువ్వులను సమర్పించడం వల్ల జీవితానికి శాంతి, స్థిరత్వం లభిస్తుంది.
  2. రెండవ రోజు బ్రహ్మచారిణి: గులాబీలు, మల్లెపూలు తపస్సుకు ప్రతీక అయిన బ్రహ్మచారిణికి చాలా ప్రియమైనవి. ఈ పువ్వులను సమర్పించడం వలన భక్తుని భక్తి , ఏకాగ్రత బలపడుతుంది.
  3. మూడవ రోజు చంద్రఘంట: ధైర్యం, శౌర్య దేవత అయిన చంద్రఘంటకు బంతి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆమెకు బంతి పువ్వులు సమర్పించడం వల్ల శత్రువులపై విజయం, ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
  4. నాల్గవ రోజు కూష్మాండ దేవి: విశ్వానికి అధిష్టాన దేవత అయిన కూష్మాండ దేవికి ఎర్ర మందార సమర్పించడం ఉత్తమం. అమ్మ ఆశీర్వాదంతో ఆరోగ్యం, తేజస్సు , దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. ఐదవ రోజు స్కందమాత: పిల్లల ఆనందాన్ని ఇచ్చే స్కందమాతకు కమలం అంటే చాలా ఇష్టం. కమల పువ్వును సమర్పించడం వల్ల ఇంటికి శ్రేయస్సు , పిల్లలకు శ్రేయస్సు లభిస్తుంది.
  7. ఆరవ రోజు కాత్యాయనీ దేవి: బాలిక రూపంలో ఉన్న కాత్యాయనికి కదంబ పువ్వును సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన కన్యకు తగిన జీవిత భాగస్వామి లభిస్తుందని, వైవాహిక ఆనందాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్మకం.
  8. ఏడవ రోజు కాళరాత్రి: భయాన్ని, శత్రువులను నాశనం చేసే కాళరాత్రి అమ్మవారికి మల్లి పువ్వులు, నీలం రంగు కృష్ణ తామర పువ్వు, మందార పువ్వులు అంటే ఇష్టం. ఈ పువ్వులను అర్పించడం వల్ల ప్రతికూల శక్తి, భయాన్ని దూరం చేస్తుంది.
  9. ఎనిమిదవ రోజు మహాగౌరి: స్వచ్ఛత, అందానికి దేవత అయిన మహాగౌరికి తెల్లని మల్లెలు, గులాబీ పువ్వులు సమర్పించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది జీవితానికి ఆనందం, సంతృప్తిని తెస్తుంది.
  10. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి: విజయాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే సిద్ధిదాత్రి దేవికి నీలి కమలం లేదా మల్లెను సమర్పించడం వలన జీవితంలో విజయం, దైవిక శక్తి వస్తుంది.

నవరాత్రి సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను వారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల భక్తులకు అదృష్టం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఈ నవరాత్రిలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పువ్వులను సమర్పించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులను పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us