Navaratri 2024: ఈ దుర్గాదేవి ఆలయం వెరీ వెరీ స్పెషల్.. నవరాత్రి 9 రోజులే తెరచుకుంటుంది..

|

Oct 05, 2024 | 3:36 PM

నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శక్తిస్వరూపిణిని పూజిస్తారు. అయ్తీ సర్వసాధారణంగా అమ్మవారి ఆలయాలు ఏడాదిలో గ్రహణాలు వంటి సందర్భాల్లో మినహా తెరచి ఉంటాయి. అయితే ఒక ఆలయం మాత్రం కేవలం నవరాత్రులలో మాత్రమే తెరవబడి ఉంటుంది. ఆ దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.

Navaratri 2024: ఈ దుర్గాదేవి ఆలయం వెరీ వెరీ స్పెషల్.. నవరాత్రి 9 రోజులే తెరచుకుంటుంది..
Dandu Maa Temple
Follow us on

మన దేశంలో దుర్గదేవి దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. చాలా దేవాలయాలు చాలా పురాతనమైన నమ్మకాలను కలిగి ఉన్నాయి. కొన్ని ఆలయాలు వాటి అద్భుతాల కారణంగా వార్తల్లో నిలుస్తాయి. ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శక్తిస్వరూపిణిని పూజిస్తారు. అయ్తీ సర్వసాధారణంగా అమ్మవారి ఆలయాలు ఏడాదిలో గ్రహణాలు వంటి సందర్భాల్లో మినహా తెరచి ఉంటాయి. అయితే ఒక ఆలయం మాత్రం కేవలం నవరాత్రులలో మాత్రమే తెరవబడి ఉంటుంది. ఆ దేవాలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.

దండు మా దేవాలయం ఎక్కడ ఉంది?

ఒడిశాలోని ప్రసిద్ధ దేవాలయాలలో దండు దేవి దేవాలయం ఒకటి. ఇది ఒడిశాలోని గజపతి జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతంలో వస్తుంది. పర్లాకిమిడిని పర్ల అని కూడా అంటారు. ఇక్కడి ప్రజలు ఒరియా మాట్లాడతారు. ఈ ప్రాంతంలో తెలుగు భాష కూడా వాడుకలో ఉంది. దీనికి కారణం ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండడమే. నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

దండు మా ఆలయానికి సంబందించిన నమ్మకం ఏమిటి?

దుర్గా దేవి కొలువైన ఈ ఆలయం చాలా చిన్నది.. అయినా ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని నవరాత్రి ఉత్సవాల్లో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఇలాంటి సంప్రదాయం ఎందుకు మొదలైంది అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ ఆలయంలో ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందో స్పష్టంగా తెలియక పోయినా నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయానికి దక్షిణాది నుండి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. నవరాత్రుల 9 రోజులు పూర్తయిన తర్వాత.. ఆలయ ద్వారం వద్ద కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత సంవత్సరం పాటు ఆలయాన్ని మూసివేస్తారు.

ఇవి కూడా చదవండి

నవరాత్రులలో ఈ 9 అమ్మవారిని పూజించండి

నవరాత్రి 2024 ప్రారంభమైంది. ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. ఈ కాలంలో ప్రతి రోజు దుర్గాదేవి పూజకు అంకితం చేయబడుతుంది. నవరాత్రులలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి వంటి దేవతలను పూజిస్తారు. ఈసారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 03 న ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 11 వరకు కొనసాగతాయి. దీని తర్వాత అక్టోబర్ 12న విజయ దశమి పండుగను జరుపుకుంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి