Rudraprayag: శివయ్య నామ స్మరణతో స్పందించే చెరువు.. నీటి బుడగలుగా ఉప్పొంగే నీరు.. మిస్టరీ కుండం ఎక్కడుందంటే..

|

Jun 08, 2024 | 7:51 AM

దేశం, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు ఉత్తరాఖండ్ కు చేరుకుంటారు. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆలయాల్లో ఒకటి కేదార్నాథ్. చార్ ధామ్‌లలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్‌కు కొంత దూరంలో అనేక చెరువులు ఉన్నాయి. వీటిల్లో ఓ చెరువు శివుడి నామ స్మరణ చేస్తే చాలు.. నీరు స్పందిస్తుంది. వేగంగా కదులుతూ ఉప్పొంగుతుంది. ఈ చెరువు ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ అద్భుతమైన చెరువు ఎక్కడ ఉంది.. ఎలా ఏర్పడింది తెలుసుకుందాం..

Rudraprayag: శివయ్య నామ స్మరణతో స్పందించే చెరువు.. నీటి బుడగలుగా ఉప్పొంగే నీరు.. మిస్టరీ కుండం ఎక్కడుందంటే..
Retas Kund In Kedarnath
Follow us on

ఉత్తరాఖండ్ భూమి దేవతల భూమిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అనేక పురాతన, అద్భుతమైన ఆలయాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా.. ఈ దేవాలయాలలో అనేక సరస్సులు, చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అద్భుతాలను, అందమైన దృశ్యాలను చూడడానికి దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు ఉత్తరాఖండ్ కు చేరుకుంటారు. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆలయాల్లో ఒకటి కేదార్నాథ్. చార్ ధామ్‌లలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్‌కు కొంత దూరంలో అనేక చెరువులు ఉన్నాయి. వీటిల్లో ఓ చెరువు శివుడి నామ స్మరణ చేస్తే చాలు.. నీరు స్పందిస్తుంది. వేగంగా కదులుతూ ఉప్పొంగుతుంది. ఈ చెరువు ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ అద్భుతమైన చెరువు ఎక్కడ ఉంది.. ఎలా ఏర్పడింది తెలుసుకుందాం..

ఈ చెరువు ఎక్కడ ఉంది?

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో సరస్వతి నది ఉంది. ఈ నది ఒడ్డున ఉన్నే రేటాస్ కుండ్(రేటాస్ చెరువు). ఈ చెరువు కామ దేవుడి భార్య రతీదేవి కంటి నీరుతో ఏర్పడిందని పురాణాల కథ. శివుడి తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేశాడు. తన భర్త మరణంతో రతి దేవి ఏడుస్తూ ఉండేదట. అలా ఆమె కన్నీరు పడిన ప్రాంతం రేటాస్ చెరువుగా ఏర్పడింది. అంతేకాదు ఈ ప్రాంతంలో పాండవుల మధ్యముడు భీముడు శివుడిని పూజించాడని ఓ కథనం. ఇక్కడ కుండంలోని పవిత్ర జలాలను సేవిస్తే.. శివుడి అనుగ్రహం లభిస్తుందని.. శివయ్య ఆశీర్వాదంతో కోరిన కోర్కెలు నెరవేరతాయని మరొక కథనం.

ఇవి కూడా చదవండి

బుడగలు ఎప్పుడు ఏర్పడతాయంటే..?
ఈ కుండానికి సంబంధించిన మరొక అద్భుత విషయం ఏమిటంటే.. ఎవరినా భక్తులు ఈ కుండం దగ్గరకు వెళ్లి శివయ్య నామ స్మరణ చేయాలి. లేదా కుండం దగ్గర ఓం నమఃశివాయ అని జపించినప్పుడల్లా.. చెరువులోని నీరు సహజంగా మరగడం ప్రారంభమవుతుంది. అలా నీరు మరిగి నీటి నుండి బుడగలు ఉద్భవిస్తాయి. ఇలా ఎవరైతే స్మరిస్తే నీటి మీద బుడగలు ఏర్పడతాయో.. ఆ భక్తుల కోరికలు నెరవేరుతాయని పురాణాల నమ్మకం. అంతేకాదు ఎవరైనా ఈ చెరువులోని పవిత్ర జలాన్ని తాగితే.. శివుని దివ్య అనుగ్రహాన్ని పొందుతాడని కూడా స్థానికుల విశ్వాసం.

2013లో కనుమరుగైన కుండం

కేదార్‌నాథ్ ధామ్ పరిసర ప్రాంతాల్లో 2013 సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు కేదార్‌నాథ్ ధామ్ మ్యాప్‌ను మార్చింది. ఆ భయంకరమైన విపత్తుతో అనేక చెరువులు నాశనం అయ్యాయి. కనుమరుగయ్యాయి. అలా కనుమరుగైన కుండాల్లో ఒకటి రెటాస్ కుండం. ఈ చెరువు అంతరించిపోయిన తర్వాత కూడా.. ఇప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. శివయ్య పట్ల చెరువు పట్ల భక్తులకు ఉన్న భక్తి, విశ్వాసం చెక్కుచెదరలేదు. నేటికీ భారీ సంఖ్యలో భక్తులు రేటాస్ కుండం ఉండే ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు