Mysterious Temple: ఈ ఆలయంలో దేవుడిపూజ చేయాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే.. సైన్స్‌కు సవాల్ ఇక్కడ రహస్యం..

|

May 12, 2023 | 11:31 AM

ఉత్తరాఖండ్‌లోని లాటూ మందిర్‌లో అలాంటి విశిష్ట సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు గంతలు కడతాడు. 

Mysterious Temple: ఈ ఆలయంలో దేవుడిపూజ చేయాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే.. సైన్స్‌కు సవాల్ ఇక్కడ రహస్యం..
Latu Mandir Chamoli
Follow us on

దేశ వ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొని ఆలయాలు రహస్యాలు నెలవు. కొన్ని దేవాలయాలు విభిన్న సంప్రదాయాలకు ప్రసిద్ధి. అయితే కొన్ని ఆలయాల్లోని రహస్యాలను సైన్ కూడా ఛేదించలేదు. ఇలాంటి రహస్య ఆలయం ఒకటి ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులకు నేరుగా ప్రవేశం ఉండదు. అటువంటి రహస్యమైన ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని లాటూ మందిర్‌లో అలాంటి విశిష్ట సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు, నోటికి గంతలు కడతాడు.

చమోలి జిల్లాలో ఉన్న లాటు దేవాలయం 

ఈ విచిత్రమైన ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్‌లోని వానాలో ఉంది. లాటు దేవతను లాటు ఆలయంలో పూజిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం.. లాటు దేవుడిని ఉత్తరాఖండ్‌లోని నందా దేవి సోదరుడిగా భావిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎందుకు భక్తుల కళ్లకు గంతలు కడతారంటే

లాటు ఆలయంలోకొలువైన నాగరాజు తన నాగమణిపై కూర్చున్నాడని విశ్వాసం. ఈ రత్నం నుంచి వెలువడే  ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుడిని అంధుడిని చేస్తుందని నమ్మకం. అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు పూజారులు భక్తుల కళ్లకు, నోటికి గంతలు కడతారు.

వైశాఖ మాసం పౌర్ణమి నాడు తెరచుకునే ఆలయం 

ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే లాటు ఆలయ ప్రవేశం అందుబాటులో ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశం వైశాఖ మాసం పౌర్ణమి రోజున తెరుచుకుంటుంది. భక్తులందరూ దూరం నుండి దైవాన్ని చూస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లకు గంతలు కట్టి పూజలు చేస్తారు.

లాటు దేవాలయంలో ఎలా పూజలు చేస్తారంటే 

లాటు దేవాలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండిక ఎక్కువగా పఠిస్తారు. మంగళ అమావాస్య రోజున ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ ప్రసిద్ధిచెందిన, విచిత్రమైన ఆలయాన్ని సందర్శించాలనుకుంటే, ముందుగా మీరు చమోలికి చేరుకోవాలి. లాటు ఢిల్లీ నుండి బస్సులో ప్రయాణించేవారు.. రిషికేశ్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).