తెలంగాణలోని ప్రముఖ దేవాలయం ఏడుపాయలు వనదుర్గాభవాన్ని ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తోందన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడుపాయలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, ఏటా నిధులు కేటాయిస్తున్నాట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. సారథ్యంలో తెలంగామ దూసుకుపోతోందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఏడుపాయలలో ప్రారంభమైన మహా శివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరైన మంత్రి ఈ కామెంట్స్ చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏటా బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు నిధులు కేటాయిస్తున్నాం. కొండగట్టు అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించాం. వేద పండితులు, బ్రాహ్మణులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది.
– హరీశ్ రావు, తెలంగాణ మంత్రి
వనదుర్గాభవాని ఆలయంలో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రికి, ఎమ్మెల్యేలకు ఛైర్మన్ బాలాగౌడ్ స్వాగతం పలికారు. అనంతరం వనదుర్గ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..