Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతులకు అధిక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ గ్రహాల సంచార, తిరోగమనాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతుంటారు. ఇక ఈ ఫలితాలు కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. తెలివి, సంపదలకు కారకుడిగా చెప్పుకునే బుధుడు అక్టోబర్ 1న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా రాశి చక్రంలోని 3 రాశులవారి జీవితాల్లో శుభ ఘడియలు రానున్నాయి. ఫలితంగా ఆయా రాశులవారు తమ కెరీర్‌లో ఉన్నత స్థాయి, సమాజంలో కీర్త ప్రతిష్టలను సంపాదిస్తారు. అసలు కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం ఏయే రాశులకు శుభంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్యా రాశి: కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం ఈ రాశిలోనే జరగనుండడంతో వీరికి శుభఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో వృద్ధి చెందుతారు. ఆగి పోయిన పనులు అన్నీ పూర్తి అవుతాయి. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
వృషభ రాశి: కన్యా రాశిలో బుధ గ్రహ సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలను ఇచ్చేదిగా ఉండనుంది. ఈ సంచార సమయంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కెరీర్‌లో శిఖరాగ్రాలకు చేరుకుంటారు. విదేశి విద్యపై మీ ఆశలు నెరవేరుతాయి. అలాగే అన్ని రకాల వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మకర రాశి: కన్యా రాశిలో బుధుడి సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం మీకు అత్యంత విజయవంతమైనవిగా ఉంటుంది. ఇంకా విదేశీ పర్యటనకు వెళ్తారు. ఈ సమయంలో మీ తెలివితేటలు వృద్ధి చెంది, చక్కని ఫలితాలను పొందుతారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి