Masa Sivaratri: నేడు మాస శివరాత్రి.. శివయ్యను పూజించే విధానం.. నియమాలు తెలుసుకోండి..

|

Oct 12, 2023 | 7:04 AM

మాస శివరాత్రి ఆరాధన పుణ్య ఫలితాలను పొందడానికి శివ భక్తుడు మొదట అభ్యంగ స్నానం చేసి.. ధ్యానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి రాగి పాత్రలో నీటిని శివునికి సమర్పించాలి. అనంతరం పూలు, బెల్లం, జమ్మి ఆకులు, భస్మం, రుద్రాక్ష, పాలు, పెరుగు, పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి పూజించాలి.

Masa Sivaratri: నేడు మాస శివరాత్రి..  శివయ్యను పూజించే విధానం.. నియమాలు తెలుసుకోండి..
Lord Shiva
Follow us on

హిందూ మతంలో ప్రతి నెల కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఈ రోజున మాస శివరాత్రి ఉపవాసం, లయకారుడైన మహాదేవుని ఆరాధించడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివ భక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం ద్వారా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు. తమ కష్టాలను తొలగించి కోరుకున్న వరం ఇస్తాడు అని నమ్ముతారు. క్యాలెండర్ ప్రకారం పితృ పక్షంలో వచ్చే మాస శివరాత్రి పండుగను ఈ రోజు 12 అక్టోబర్ 2023 న జరుపుకుంటారు. నేడు శివుడిని పూజించడానికి సరైన పద్ధతి.. చేయాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం.

మాస శివరాత్రి పూజ పద్ధతి

మాస శివరాత్రి ఆరాధన పుణ్య ఫలితాలను పొందడానికి శివ భక్తుడు మొదట అభ్యంగ స్నానం చేసి.. ధ్యానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి రాగి పాత్రలో నీటిని శివునికి సమర్పించాలి. అనంతరం పూలు, బెల్లం, జమ్మి ఆకులు, భస్మం, రుద్రాక్ష, పాలు, పెరుగు, పండ్లు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి పూజించాలి. జలాభిషేకం చేసి శివుడిని పూజించిన తరువాత సాధకుడు శివరాత్రి వ్రతాన్ని పఠించాలి. శివ చాలీసా చదవాలి లేదా శివ మంత్రాలను పఠించాలి. శివుడిని భక్తి, విశ్వాసంతో పూజించాలి. హిందువుల విశ్వాసం ప్రకారం మాస శివరాత్రి రోజు రాత్రి నాలుగు ప్రహార్లను పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నాలుగుజాములు పూజించడం ద్వారా శివుడు త్వరలో ప్రసన్నుడవుతాడు.  కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు.

శివరాత్రి పూజ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. శివరాత్రి రోజున శివపూజ చేసేటప్పుడు కుంకుమ, పసుపు, తులసి, శంఖం మొదలైన వాటిని ఉపయోగించకండి. శివుడి పూజలో వీటిని ఉపయోగించడం నిషేధం.
  2. శివుడికి పొరపాటున కూడా మొగలి పువ్వుని సమర్పించవద్దు.
  3. ఇవి కూడా చదవండి
  4. శివరాత్రి ఆరాధన ఫలితాలను పొందడానికి మహాదేవునితో పాటు పార్వతిని.. గణేశుడిని, కార్తికేయుడిని  పూజించండి. మాస శివరాత్రి పర్వదినం గురువారం కావడంతో శ్రీ హరిని పూజించాలి.
  5. శివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకండి.
  6. శివరాత్రిని ఆరాధించే భక్తుడు ఆరాధన ముగింపులో మహాదేవునికి హారతి ఇవ్వండి.
  7. శివరాత్రి వ్రతంలో పొరపాటున కూడా తామసిక వస్తువులను సేవించకండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.