Panakam: మంగళగిరి నరసింహస్వామి వారి ‘పానకం’ రేటెంతో తెలుసా..? అక్షరాలా రూ. ఒక కోటి 35 లక్షలు.!

|

Aug 14, 2021 | 3:33 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి పానకం వేలం పాటలో రికార్డ్ రేటు పలికింది. ఇవాళ జరిపిన వేలం పాటలో ఒక కోటి

Panakam: మంగళగిరి నరసింహస్వామి వారి పానకం రేటెంతో తెలుసా..? అక్షరాలా రూ. ఒక కోటి 35 లక్షలు.!
Panakam Auction
Follow us on

Mangalagiri Lakshminarasimha swami: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి పానకం వేలం పాటలో రికార్డ్ రేటు పలికింది. ఇవాళ జరిపిన వేలం పాటలో ఒక కోటి 35 లక్షలకు ఒకామె స్వామి వారి పానకంను దక్కించుకున్నారు. స్వామి వారి పానకానికి ఈ దఫా మరింత ఎక్కువగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, గత సంవత్సరం సీల్డ్ టెండర్ ద్వారా కోటి 26 లక్షలు పలికిన పానకం రేటు. ఈసారి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకు టెండర్ పాడి కాంట్రాక్ట్ దక్కించుకుంది పున్నమ్మ అనే మహిళ.

ఇలాఉండగా, మంగళగిరిలో కొలువైఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద పరిగణిస్తారు. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహస్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట.

ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు, చీమలు చేరకపోవడం మరొక ఆశ్చర్యం కలిగించే అంశం.