Maha Shivaratri: పెళ్లి, ఉద్యోగం, డబ్బు.. శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

Aparajita Flower: అపరాజిత పువ్వులు శివలింగానికి అత్యంత ప్రియమైనవి అని నమ్మకం ఉంది. అందుకే, భక్తులు ఈ పువ్వులను సమర్పించడం ద్వారా ఆర్థిక, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. శివరాత్రి రోజున శివుడికి అపరాజిత పుష్పాలను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Maha Shivaratri: పెళ్లి, ఉద్యోగం, డబ్బు.. శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
Shivaratri

Updated on: Feb 07, 2026 | 11:24 AM

మరికొద్ది రోజుల్లో మహా శివరాత్రి రానుండటంతో ఆది దేవుడి భక్తులు ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సిద్ధమవుతున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు భక్తులు మహా శివుడికి పూజలు చేసి ఆయన ఆశీర్వాదాలను పొందేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ పండుగను “శివ–శక్తి వివాహం”(శివపార్వతుల కళ్యాణం)గా జరుపుతారు. ఆ పవిత్ర రోజులలో అపరాజిత పువ్వులు (శంఖు పుష్పాలు) శివలింగానికి అత్యంత ప్రియమైనవి అని నమ్మకం ఉంది. అందుకే, భక్తులు ఈ పువ్వులను సమర్పించడం ద్వారా ఆర్థిక, వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. శివుడికి అపరాజిత పుష్పాలను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక సమస్యలకు ముగింపు

మహాశివరాత్రి నాడు, 11 అపరాజిత పువ్వులను శివలింగానికి సమర్పించండి. అందులో కొన్ని పువ్వులను ఎంచుకొని పూర్తిగా ఆరబెట్టి, ఇంటిలోని సేఫ్ లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచవచ్చు. ఈ చిన్న పద్ధతిని పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తగ్గి, లాభం పొందే అవకాశాలు పెరుగుతాయని విశ్వాసం ఉంది.

ఉద్యోగ, వ్యాపార, ప్రమోషన్ కోసం

పనిలో ప్రమోషన్ సమస్యలు ఎదురవుతున్నా, వ్యాపార నష్టాలు ఎదురవుతున్నా, మహాశివరాత్రి నాడు ఒక అపరాజిత పువ్వును శివలింగానికి సమర్పించి 51 సార్లు శివ పంచాక్షర మంత్రాన్ని జపించండి. ఈ పువ్వును తర్వాత మీ కార్యాలయంలో ఉంచితే, భగవంతుని ఆశీర్వాదంతో సమస్యలన్నీ తొలగుతాయని చెబుతారు.

వివాహం లేదా వివాహానికి సానుకూలత కోసం

వివాహం ఆలస్యం అవుతున్నవారికి, రెండు అపరాజిత పువ్వులను ఒక కుండ/కలశం నీటిలో ఉంచి, ఆ నీటిని శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా వివాహానికి సానుకూల ఫలితం పొందవచ్చని నమ్మకం ఉంది. ఆ తరువాత పువ్వులను ఇంటికి తీసుకువెళ్ళి పూజా స్థలంలో ఉంచడం ద్వారా కుటుంబంలో ఆనందం, సుఖసమృద్ధి వస్తుందని చెబుతారు.

పరీక్షలు, ఉద్యోగం, విజయాల కోసం

మహాశివరాత్రి నాడు, ఒక అపరాజిత పువ్వు, కొన్ని బియ్యం గింజలను తెల్లటి వస్త్రంలో కట్టి, 11 రోజులు పూజా స్థలంలో ఉంచి, 11వ రోజు నదిలో ముంచితే.. విద్య, ఉద్యోగం, వ్యాపార, వ్యక్తిగత విజయాల కోసం దారి సులభమవుతుందని విశ్వాసం ఉంది. జీవితంలో పురోగతి లభిస్తుందని నమ్మకం.

మహాశివరాత్రి భక్తులకు కేవలం పండుగ మాత్రమే కాదు, వారి జీవితంలో శాంతి, సంపన్నత, విజయానికి మార్గంగా మారుతుంది. అపరాజిత పువ్వుల ద్వారా శివుని ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా, ప్రతి భక్తి తన జీవనంలోని ప్రతి కష్టాన్ని అధిగమించగలడని పౌరాణిక విశ్వాసం నమ్ముతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us