ఈ సారి హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన సంఘటన ఇంతకు ముందు 1924లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని చెప్పారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే 25 మార్చి 2024 సోమవారం నాడు ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం, అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం ఏంటంటే..హోలీ పండగ రోజునే చంద్రగ్రహణం అంటే ఎవరికీ ఎలాంటి ప్రభావం ఉంటుంది..? ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ సారి హోళి పండగ రోజునే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అది కూడా వంద సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన ఘటన. ఇప్పుడు మార్చి 25 సోమవారం హోలీ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2024 సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్ర గ్రహణం కూడా ఇదే. ఈ సమయంలో రాహువు కన్య రాశిలో ఉంటాడు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్ర గ్రహణం అర్ధరాత్రి మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు.
మన దేశంలో కనబడదు కాబట్టి మనం ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు. హోలీ పండుగపై చంద్రగ్రహణం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జ్యోతిశాస్త్రనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం, అది కూడా హోలీ రోజున ఏర్పడనుంది కాబట్టి.. కొన్ని రాశుల వారికి శుభప్రదం అంటున్నారు. పంచాంగం ప్రకారం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కాలానుగుణంగా సంభవిస్తాయి. ఇది మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు