చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించి హిందూ మతంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. గ్రహణ సమయంలో ఆహారం నుంచి అన్ని రకాల నియమాలను పాటించాలని సూచించారు. గ్రహణ ఏర్పడే సమయంలో వాతావరణంలో ప్రతికూలత వ్యాపిస్తుందని.. కనుక ఈ సమయంలో కొన్ని పనులు చేస్తే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆహారం నుంచి జీవనశైలి వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం ఏర్పడే తేదీ, గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? తేదీ, సమయం
2023 సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి ఏర్పడనుంది. అది అర్ధరాత్రి ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రభావం భారతదేశంలో కనిపించదు. ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. నివేదికల ప్రకారం భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8.44 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.20 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం దాదాపు 4 గంటల 15 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు.
చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు.. గ్రహణ సమయంలో చేయవలసినవి, చేయకూడనివి
ఈ గ్రహణ ప్రభావం భారతదేశంలో కనిపించకపోయినా.. గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఆహారం తినడం నిషేధించబడింది. పెద్దలు పెట్టిన నియమాలను పట్టించుకోకుండా ఆహారం తిన్నట్లు అయితే జీర్ణవ్యవస్థలో ఇబ్బంది ఏర్పడుతుందని నమ్మకం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపై మాత్రమే కాకుండా అనేక ఇతర విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గ్రహణం సమయంలో నీరు త్రాగకూడదని విశ్వాసం. ఇలా నీరు తాగడం శరీరానికి హాని కలిగిస్తుంది. అయినప్పటికీ దీనికి శాస్త్రీయ రుజువు లేదు. కానీ ఇప్పటికీ ప్రజలు ఈ నియమాలను అనుసరిస్తూనే ఉన్నారు.
చంద్రగ్రహణం సమయంలో నిద్రించడం నిషేధించబడింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేసే పనుల వలన కలిగే నష్టాన్ని తల్లి, బిడ్డ ఇద్దరూ భరించవలసి ఉంటుందని విశ్వాసం.
చంద్రగ్రహణం సమయంలో బిడ్డ పుడితే ఎదో జరుగుతుందనే అపోహ కూడా ప్రజల్లో ఉంది. గ్రహణ సమయంలో బిడ్డ పుడితే చాలా నష్టాలుఏర్పడతాయని నమ్మకం. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).