
ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ, ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. దీంతో మనశ్శాంతి కరవవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమయానికి డబ్బు చేతికందదు. ఇది ఎన్నో రకాలుగా మానసిక వేదనను మిగులుస్తుంది. ఇలా డబ్బు సమస్యలతో బాధపడేవారికి వాస్తు శాస్త్రం కొన్ని రెమిడీస్ ను సూచిస్తోంది. మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకొచ్చి మీ ఇబ్బందులను పోగొట్టేందుకు కొన్నిరకాల జంతువులను పేర్కొంటోంది. వీటి ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట ఉన్న ప్రతికూల శక్తి దానికదే తొలగిపోతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. మరి మీ ఇంటికి శుభాన్ని, అదృష్టాన్నికలిగించే జంతువులేంటో చూసేయండి.
ఏనుగును సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు. ఈ జంతువు కలలో కనిపించినా ఏదైనా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ఏనుగు బొమ్మలు, చిత్రపటాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఆ ఇళ్లంతా ప్రసరిస్తుందని వాస్తు పండితులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీ ఇంటి అలంకరణ, పూజా మందిరం అలంకరణలో వీటికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించండి.
ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం కప్లపు ఇంటికి ధనాన్న ఆకర్షిస్తాయి. కప్ప ఫొటోలు గానీ, బొమ్మలను గానీ ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంటారు. ధనాన్ని ఆకర్షించడానికి,కప్పలకు ప్రత్యేక సంబంధం ఉందని పండితులు చెప్తున్నారు.
చాలా మంది ఇళ్లలో అక్వేరియం ఉంచుకుంటారు. ఇందులో రకరకాల చేపలను తెచ్చి పెంచుతుంటారు. అయితే ఇలా పెంచుకునే చేపల్లో గోల్డ్ ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. వీటిని ఇంట్లో పెంచితే పాజిటివ ఎనర్జీ లభిస్తుందట ధనాన్ని కూడా ఇవి పెంచుతాయి. ఈ సారి అక్వేరియం తీసుకోవాలనుకునే వారు, చేపలను పెంచుకునే హాబీ ఉన్నవారు గోల్డ్ ఫిష్ ను మరువకండి.
గుర్రం వేగానికి, సామర్థ్యానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో అశ్వినీ దేవతలను గుర్రాలతో పోలుస్తుంటారు. వీరినే తథాస్తు దేవతలు అని కూడా పిలుస్తారు. గుర్రం పెయింటింగ్స్ ను ఇంట్లో పెట్టుకునేవారికి ఏదో ఒక రూపంలో లక్ కలిసొస్తుందని చెప్తారు. ముఖ్యంగా మేష రాశి వారికి ఇదెంతో మేలు చేస్తుందట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే వారి కెరీర్ లో కూడా ఊహించని మార్పులు, మంచి ఫలితాలు చూడొచ్చని పండితులు చెప్తున్నారు.
తాబేలు నిలకడకు సంకేతం. మన ఇంట ధనలక్ష్మి కూడా అంతే నిలకడతో ఉండాలని కోరుకుంటారు. తాబేలు బొమ్మలను వ్యాపార స్థలాల్లో ఇంట్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇవి తూర్పు ముఖంగా చూడటం మంచిదని నమ్ముతారు. అయితే ఇవి వివిధ వాస్తు శాస్త్రాల్లో లభించిన సమాచారం మేరకు ఇస్తున్న సమాచారం మాత్రమే. మరిన్ని మంచి ఫలితాలకు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.