Lord Srirama: వనవాసంలో రామయ్య పూజించిన ఈ వృక్షాన్ని ఇంట్లో పెంచుకోండి.. ఏ దిశలో నాటడం శ్రేయస్కరం అంటే..

భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు  ఇష్టమైన రావి, తులసి, జమ్మి, అరటి వంటి చెట్లను లేదా మొక్కలను పూజలో ఉపయోగిస్తారు. అయితే జమ్మి చెట్టుకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. శ్రీ రాముడు వనవాసం చేస్తున్న సమయంలో జమ్మి చెట్టును పూజించాడని చెబుతారు. ఈ చెట్టును పూజించడం వల్ల లేదా ఇంట్లో నాటడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

Lord Srirama: వనవాసంలో రామయ్య పూజించిన ఈ వృక్షాన్ని ఇంట్లో పెంచుకోండి.. ఏ దిశలో నాటడం శ్రేయస్కరం అంటే..
Lord Sri Rama Shami Tree

Updated on: Jan 27, 2024 | 12:49 PM

హిందూ మతంలో ప్రకృతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెట్లు, పక్షులు, జంతువులకు విశిష్ట స్థానం ఉంది. పూజిస్తారు. అంతేకాదు అనేక చెట్లను, మొక్కలు దేవతల నివాసంగా పరిగణిస్తారు. కొన్ని చెట్లు, మొక్కలు దేవుళ్ళకు చాలా ప్రియమైనవిగా పరిగణిస్తారు. అందుకే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు  ఇష్టమైన రావి, తులసి, జమ్మి, అరటి వంటి చెట్లను లేదా మొక్కలను పూజలో ఉపయోగిస్తారు. అయితే జమ్మి చెట్టుకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. శ్రీ రాముడు వనవాసం చేస్తున్న సమయంలో జమ్మి చెట్టును పూజించాడని చెబుతారు. ఈ చెట్టును పూజించడం వల్ల లేదా ఇంట్లో నాటడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

శమీ వృక్షాన్ని పూజించడంలో ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం శ్రీ రాముడు వనవాస సమయంలో జమ్మి వృక్షాన్ని పూజించేవాడు. శమీ వృక్షాన్ని హిందూ మతంలో ఎంతో పూజ్యనీయంగా భావిస్తారు. చాలా మంది దీనిని తమ ఇంట్లో పెంచుకుని పూజిస్తారు.

శివునికి ప్రియమైన జమ్మి చెట్టు

జమ్మి చెట్టు కూడా శివునికి ఇష్టమైందిగా పరిగణించబడుతుంది. శివునికి జమ్మి ఆకులతో పూజించడం వలన  శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పూజలో, హవనంలో జమ్మి ఆకులను ఉపయోగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుంది. దేవతలు కూడా సంతోషిస్తారు.

ఇవి కూడా చదవండి

శనీశ్వరుడి కోపాన్ని తగ్గించే జమ్మి ఆకు

ఇంట్లో జమ్మి చెట్టుని పెంచుకోవడం, ప్రతి రోజూ పూజిస్తే శనీశ్వరుడి కోపం చల్లారుతుందని నమ్ముతారు. ఇలా జమ్మి ఆకులతో శనీశ్వరుడిని పూజించడంతో జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.

సంతోషకరమైన వివాహ జీవితం

శనీశ్వరుడిని పూజించడం వల్ల వైవాహిక జీవితం ఆనందమయం అవుతుందని, కుటుంబ సభ్యుల వివాహాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

ఆనందం, శ్రేయస్సు కోసం జమ్మి చెట్టు పెంపకం

ఇంటి ఆవరణలోని ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య మూలలో జమ్మి చెట్టుని పెంచుకోవాలి. ఈ ప్రదేశం శమీ వృక్షానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో శమీ మొక్కను పెంచుకోవడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభించి ఇంట్లో సంతోషం నెలకొంటుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు