Diwali 2021: పిల్లల్ని క్రాకర్స్ కాల్చనివ్వండి.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలా చేయండి.. జగ్గీ వాసుదేవ్ సలహా

|

Nov 03, 2021 | 12:59 PM

jaggi Vasudev On Diwali 2021: హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి.  ఈ పండగను దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటారు. ఆనందోత్సాలతో దీపాల వెలిగిస్తారు ..

Diwali 2021: పిల్లల్ని క్రాకర్స్ కాల్చనివ్వండి.. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలా చేయండి.. జగ్గీ వాసుదేవ్ సలహా
Sadhguru Vasudev
Follow us on

jaggi Vasudev On Diwali 2021: హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి.  ఈ పండగను దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటారు. ఆనందోత్సాలతో దీపాల వెలిగిస్తారు .. బాణాసంచా కాలుస్తారు. అయితే దీపావళి సమయంలో బాణాసంచా కాల్చడంపై భిన్న వాదలను వినిపిస్తున్నాయి. కొంతమంది పర్యావరణ పరిరక్షణ కోసం దీపావళి రోజున బాణాసంచా కాల్చవద్దని అంటారు. మరికొందరు… రాజకీయ నాయకుల సంబరాల్లో, పెళ్లిళ్లు, పంక్షన్లు వంటి అనేక కార్యక్రమాల సమయంలో బాణా సంచా ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుకు రాని ఎయిర్ పొల్యూషన్ ఒక్క దీపావళి పండగ రోజునే గుర్తుకొస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు దీపావళి వేడుకల్లో క్రాకర్స్ ను నిషేధిస్తే,, మరికొన్ని పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దీపావళి వేళ క్రాకర్స్‌ బ్యాన్‌పై జగద్గురు జగ్గీ వాసుదేవ్‌ స్పందించారు .

ఆధ్యాత్మిక సద్గురు జగ్గేయే వాసుదేవ్ దీపావళి రోజున పిల్లల్ని క్రాకర్స్‌ కాల్చనివ్వండి. వారి ఆనందానికి ఎయిర్‌ పొల్యూషన్‌ అడ్డంకి కాకూడదన్నారు. వాయు కాలుష్యానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి కానీ..టపాసులపై నిషేధం విధించడం కరెక్ట్‌ కాదన్నారు. అంతేకాదు బాణాసంచా నిషేధానికి మద్దతిచ్చే ప్రజలు..మూడ్రోజుల తమ వాహనాలను ఉపయోగించడం మానేయాలని.. తమ ఆఫీసులకు, ఇతరపనులకు నడుచుకుంటూ వెళ్లాలని కోరారు. “పిల్లలు బాణాసంచా కాలుస్తూ అనుభవించే ఆనందానికి వాయు కాలుష్యం అడ్డు కారాదని అన్నారు.

అంతేకాదు దేశంలో బాణసంచా నిషేధానికి మద్దతుగా నిలిచిన వ్యక్తులకు సద్గురు ఓ సలహా ఇచ్చారు. వాయు కాలుష్యం కో ఆలోచించే మీరు ఒక చిన్న త్యాగం చేయమని.. వారంలో ఒక మూడు రోజులు మీ ఆఫీసుకి నడిచి వెళ్ళండి అని చెప్పారు. దీపావళికి మీ ఫ్యామిలీ, పిల్లలతో కలిసి పటాకులు పేల్చి ఆనందించండని చెప్పారు.

ఈ మేరకు సద్గురు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను చాలా సంవత్సరాలుగా క్రాకర్‌ని వెలిగించడం లేదని చెప్పారు. అయితే  తన చిన్నతనంలో దీపావళి వస్తుందంటే… బాణాసంచా కోసం ఒక నెల ముందు నుంచి కలలు కంటూ ఉండేవారమని.. ఇక దీపావళి పండగ అనంతరం కూడా ఆ ఫీలింగ్ ఒకటి రెండు నెలలు ఉండేదని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాము దీపావళికి కొన్న బాణాసంచా మరో రెండు నెలలు వరకూ దాచి.. వాటిరోజు చూస్తూనే సంతోషపడేవారమని.. నేటి బాల్యానికి ఆ మధుర జ్ఞాపకాలను దూరం చేయొద్దంటూ సద్గురు సూచించారు.

Also Read: రంగు రంగుల పూలతో అందంగా ముస్తాబైన బద్రీనాథ్ ఆలయం.. రేపు కుబేరుడికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు