Unique Festival: ఆధునిక కాలంలో కూడా ప్రజలు ఒక్కసారి నమ్మితే చాలు.. అది సాధ్యమా అనే ఆలోచన లేకుండా ఫాలో అవుతారు. తాజాగా ఓ చోట మీ కష్టాలు తీరాలంటే.. స్వామి కాలితో తంతే చాలు అంటూ ఓ ప్రచారం మొదలైంది. అవును ఈ బాబా కాలుతో తంతే కష్టాలు తొలగి పోతాయంటూ ప్రచారం హోరెత్తిపోవడంతో.. చదువుకొని వారే కాదు.. ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేస్తున్న వారు కూడా నమ్మి తన్నులకోసం క్యూలు కడుతున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని పత్తికొండ మండలం పెద్ద హల్లిలో ఓ బాబా కాళ్లతో తంతే ఎటువంటి కష్టాలైనా తీరతాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ విషయాల్ని నమ్మిన జనం.. ఆ బాబాతో తన్నించుకోవడానికి క్యూలు కడుతున్నారు. పెద్ద హళ్లిలో దీపావళి పండగ వెళ్లిన మూడురోజుల తర్వాత హుల్తిలింగేశ్వర స్వామి వారి ఉత్సవాలు జరుతాయి.
ఓ వ్యక్తి హుల్తిలింగేశ్వర ఉత్సవమూర్తి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని వస్తారు. ఆ సమయంలో ఆ వ్యక్తి చేతిలో ఖడ్గం ధరిస్తారు. నెత్తిమీద స్వామివారి విగ్రహం తలపై పెట్టుకుని ఊరేగింపుగా గుడి దగ్గరకు చేరుకుంది. ఇలా స్వామివారు ఊరేగే సమయంలో తమ ఆర్ధిక కష్టాలు, సమస్యలను తీర్చమని కోరుకుంటూ.. భక్తులు బోర్ల పడుకొని ఉంటారు. అప్పుడు హుల్తిలింగేశ్వర స్వామి ఆవహించిన వ్యక్తి అలా బోర్లా పడుకున్నవారిని తన్ని.. వారి సమస్యలను విని ఆశీర్వదిస్తాడు.
ఇలా తన్నించుకుంటే ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, పిల్లలు లేనివారికి పిల్లలు, అప్పులు తీరతాయని, ఆరోగ్యంగా ఉంటారని తమ సమస్యలు పరిష్కారమయ్యి.. సంతోషంగా ఉంటామని భక్తుల నమ్మకం. అయితే ఈ వింత ఆచారాన్ని చూడడానికి కూడా భారీ సంఖ్యలో తరలివస్తారు.
Also Read: ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. పక్క రాష్ట్రాల్లో పెళ్లికూతుర్ల కోసం వేట..