Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..

|

Apr 19, 2022 | 6:06 AM

Srisailam: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం..అష్టాదశ శక్తిపీఠం.. భూ కైలాసం గా ఖ్యాతిగాంచిన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం(Kumbhotsavam) నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు ..

Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..
Kumbh Mela At Srisalam
Follow us on

Srisailam: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం..అష్టాదశ శక్తిపీఠం.. భూ కైలాసం గా ఖ్యాతిగాంచిన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం(Kumbhotsavam) నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో నేడు  లోకకల్యాణార్థం భ్రమరాంబ దేవికి ఉత్సవం నిర్వహించనున్నారు.  ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు నిమ్మకాయలు సాత్విక బలి గా సమర్పిస్తారు. అలాగే కుంభహారతి,  అమ్మవారికి పలురకాల వంటలతో మహానివేదన సమర్పిస్తారు. దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతువులు పక్షులు బలులును పూర్తిగా నిషేధించారు.  ఆలయ సిబ్బంది స్థానిక రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో జంతు పక్షి పనులు జరగకుండా పర్యవేక్షించాలని ఈవో లవన్న ఆదేశించారు. అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవ ఈరోజు నిలుపుదల చేయనున్నట్లు చెప్పారు.

Also Read: Online Food Order: జొమాటో కంటే ముందే.. గ్రాసరీ సంస్థ కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ

Krishna River: కృష్ణా నదిపై మరో వంతెన.. రెండు జిల్లాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం