Tulsi Mala: హిందూమతంలో(Hindu Dharma) తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన, ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి విష్ణువుకు అత్యంత పవిత్రమైనది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషం ప్రభావం చూపదని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం . తులసి మొక్క విష్ణువు, లక్ష్మిలకు చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. ఇరువురు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి.. ప్రజలు ఇంట్లో తులసిని పూజిస్తారు. తులసి ఆకులు లేని విష్ణువు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుందని గ్రంథాల్లో చెప్పబడింది. అంతే కాకుండా హనుమంతుని పూజలో కూడా తులసి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది.
తులసి మొక్కను పూజించడమే కాదు దాని చెక్కతో చేసిన దండను తులసిమాలగా ధరిస్తారు. ఈ తులసిమాల కి సంబంధించిన ప్రత్యేక నియమాల గురించి తెలుసుకుందాం..
తులసి మొక్క కథ
పురాణాల ప్రకారంహిందూ పురాణాలలో తులసిని వృందగా పిలుస్తారు. కాలనేమి అనే ఒక రాక్షసుడికి అందమైన కూతురు ఒక యువరాణి. అమె మహావిష్ణువు పరమభక్తురాలు. పరమశివుని మూడో కన్ను లోంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అపారశక్తి వంతుడు. ఇతడు అందమైన యువరాణి వృందను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. రాక్షసుడైన జలందరుడి మరణానికి శ్రీ విష్ణువు కారణమవుతాడు. దీంతో కోపోద్రిక్తురాలైన బృందా విష్ణువును శపించింది. దీంతో తాను శాలిగ్రామం అంటే శిల రూపంలో జీవిస్తానని విష్ణువు చెప్పాడు. గండకి నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. వృంద చనిపోయే ముందు, విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలవబడి, తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీయలేని భాగం అయిపోయింది. తులసికి లక్ష్మీ దేవి , విష్ణువుతో ప్రత్యేక సంబంధం ఉందని భావిస్తారు.
తులసి మాల ధరించడానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకోండి.#
1. ఈ మాల ధరించాలనుకునే వ్యక్తి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి వ్యక్తి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవలసి ఉంటుంది. వెల్లుల్లి , ఉల్లిపాయలను ఉపయోగించిన ఆహారాన్ని తినరాదు.
2. తులసి మాల ధరించిన వ్యక్తి ఎల్లప్పుడూ మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. వీటిని ఆహారంగా తీసుకోవడం చాలా హానికరమని పెద్దల కథనం
3. తులసి మాల వేసుకునే ముందు గంగాజలంతో శుభ్రం చేసి పూజ చేసిన తర్వాతే ధరించాలి.
4. తులసి మాలను చేతితో చేసిన మాల ధరించాలి.
5. తులసి మాలను ధరించిన భక్తులు ప్రతి రోజు విష్ణు సహస్రనామాలు జపించవలసి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..