భారతదేశం దేవాలయాలకు నిలయం. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని రహస్యాలు, ఎన్నో అద్భుతాలు, మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇక ఛార్‌ధామ్ వంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లోకి ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతం అలాంటి ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం.
ఛత్తీస్‌గఢ్‌లోని నిరయ్ మాతా ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే గంటలే తెరుస్తారట. సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఈ దేవాలయం ఉంటుంది. ప్రతి ఏడాది ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్లీ వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు.
ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో పూజా విధానం విషయానికొస్తే.. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణలు లాంటి సామగ్రిని ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారు.
ఐదు గంటలు దర్శన సమయం అనంతరం తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారట. ఏడాది కేవలం 5 గంటలే దర్శనం అంటే, రష్ ఎలా ఉంటుందో ఊహించండి ఒక్కసారి.
ఈ ఐదు గంటలు దర్శన సమయం తర్వాత తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశం కూడా నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని స్థానికులకు ఓ నమ్మకం కూడా ఉంది. అందుకే అమ్మవారి గుడిలోకి మహిళలను ప్రవేశించనివ్వరు.