Masa Shivaratri 2024: ఈరోజు కార్తీక మాస శివరాత్రి.. శివయ్యను ఏ శుభ సమయంలో పూజించడం శుభప్రదం అంటే..

|

Nov 29, 2024 | 6:34 AM

హిందూ మతంలో మాస శివరాత్రి ఒక ముఖ్యమైన పండుగ. దీనిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి తిధిని జరుపుకుంటారు. ఈ రోజు శివునికి అంకితం చేయబడింది. శివుడిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది.

Masa Shivaratri 2024: ఈరోజు కార్తీక మాస శివరాత్రి.. శివయ్యను ఏ శుభ సమయంలో పూజించడం శుభప్రదం అంటే..
Lord Shiva Puja
Follow us on

హిందూ మతంలో మాస శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ రోజు శివునికి అంకితం చేయబడింది. ఇది మహా శివరాత్రి వలె పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ పండగను ప్రతి నెలా జరుపుకుంటారు. అదే సమయంలో పాల్గుణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజున ఏడాదికి ఒకసారి మహా శివరాత్రిని జరుపుకుంటారు. మాస శివరాత్రి రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించడం ద్వారా చేసిన పాపాలు నశిస్తాయి. జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు. కార్తీక మాస శివరాత్రిలో ఏ శుభ యోగంలో శివుడిని ఆరాధిస్తే ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నవంబర్ 29 ఉదయం 8.39 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి నవంబర్ 30వ తేదీ ఉదయం 10:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం కార్తీక మాస శివరాత్రి నవంబర్ 29 న అంటే ఈ రోజున జరుపుకోనున్నారు.

మాస శివరాత్రి పూజలకు అనుకూలమైన సమయం

పంచాంగం ప్రకారం శివుడి పూజ శుభ సమయం నవంబర్ 29 రాత్రి 11:41 నుంచి 12:25 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శుభ సమయంలో పూజలు చేస్తే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మాస శివరాత్రి పూజా విధానం

శివరాత్రి రోజున ముందుగా పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి. తరువాత, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు, గంగాజలం, ఇతర పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. శివునికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. కనుక ఈ రోజున శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుని ఆరాధనలో ఖచ్చితంగా శివలింగానికి బిల్వ పత్రాన్ని, ఉమ్మెత్త, పువ్వులు మొదలైనవి సమర్పించాలి. శివ లింగం ముందు అగరుబత్తీలు వెలిగించి సరియైన ఆచారాలతో శివుని పూజించాలి. ఇలా శివుడికి పూజ చేసే సమయంలో ఓం నమః శివయ అనే మంత్రాన్ని జపించాలి. పూజ చివరలో శివ చాలీసాను పటించి హారతిని ఇవ్వండి.

మాస శివరాత్రి ప్రాముఖ్యత

శివరాత్రి రోజున పరమ శివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడని నమ్మకం. పురాణ శాస్త్రాల ప్రకారం మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, శివుడిని పూజించడం ద్వారా, చేసిన పాపాలు నశిస్తాయి. మాస శివరాత్రి రోజున శివుని కోరికలు కోరడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడు భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయి. జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.