
కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాదు బౌద్ధమతం, జైనమతం , సిక్కు మతం అనుచరులకు కూడా చాలా పవిత్రమైనది. హిందూ మతంలో కైలాస మానసరోవర యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కైలాస మానసరోవర యాత్ర చాలా కష్టమైన ,పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది, దీనిలో పాల్గొనడంవలన తెలిసి తెలియక చేసిన సకల పాపాలను నాశనం చేస్తుంది. కైలాస మానసరోవర యాత్ర చేయడం ద్వారా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు. అలాగే ఈ ప్రయాణంలో ఒకసారి భాగమైన వారు కూడా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. అదే సమయంలో ఈ తీర్థయాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి. వీటిని పాటించడం అవసరం.
కరోనా సమయంలో క్లోజ్ అయిన ఈ కైలాస మానససరోవర యాత్ర.. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత.. మళ్ళీ ఈ కైలాస మానసరోవర యాత్ర జూన్ 30, 2025 నుంచి ప్రారంభం కానుంది. కైలాస మానసరోవర యాత్ర ఆగస్టు 2025 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో భక్తులు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.