Shivaratri 2025: శివరాత్రికి జాగారంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. మస్ట్ గా తెలుసుకోండి

శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగారానికి విశేష ఫలితాలుంటాయని పెద్దలు చెప్తారు. హిందూ శాస్త్రాల్లోనూ ఈ రోజును పాటించే నియమాలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే, ఉపవాసాలతో కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. కానీ, జాగారం చేయడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు జాగారం వల్ల చోటుచేసుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.

Shivaratri 2025: శివరాత్రికి జాగారంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. మస్ట్ గా తెలుసుకోండి
Shivaratri Jagaran Benefits

Updated on: Feb 25, 2025 | 9:02 PM

మహా శివరాత్రి హిందూ మతంలో చాలా ప్రత్యేకమైన పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో జరుపుకుంటారు. మహాశివరాత్రి రాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని నమ్ముతారు. ఈ పర్వదినం రోజున రాత్రి ఈ దేవీదేవతలిద్దరూ భూమి మీద సంచరిస్తారని భక్తుల విశ్వాసం. ఈ రాత్రి వారిని నిజమైన హృదయంతో పూజించే భక్తుడికి శివపార్వతుల ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈరోజు రాత్రంతా మేలుకుని ఉండాలని చెప్తుంటారు. శివరాత్రి జాగరణ వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.

జీర్ణశక్తికి కొత్త శక్తి..

శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణ మానవ శరీరం మీద ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతాయి. మనస్సంతా భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. రోజంతా ఉపవాసం చేయడం వల్ల మనసులోకి నెగిటివ్ ఆలోచనలు దరిచేరవు. ఇది మైండ్ కి కూడా ఒక రకమైన డీటాక్సిఫికేషన్ లా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. ఉపవాసం రోజున కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల శరీరం నూతనోత్సాహం సంతరించుకుంటుంది. పొట్టలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

మానసిక సంకల్పం పెరుగుతుంది..

రోజంతా ఆకలి, దప్పికలకు తట్టుకుని నిలవడం వల్ల శరీరానికి ఆకలిని తట్టుకునే శక్తి కలుగుతుంది. జాగరణ వల్ల నిద్రను కంట్రోల్ చేసుకోగలిగే ఇంద్రియాలపై పట్టు సాధించగలుగుతారు. శివరాత్రి రోజున రాత్రికి చేసే జాగరణతో పాటు మంత్రోచ్ఛారణ కూడా శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

ప్రాణ శక్తి లభిస్తుంది..

మహాశివరాత్రి సమయంలో గ్రహాల కూటమి కూడా మారుతుంది. మనం నిటారుగా వెన్నెముకతో కూర్చుని ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. గ్రహాల అమరిక కుండలినీ శక్తిలా మారి మన ప్రాణశక్తిని పెంచుతుందని యోగులు విశ్వసిస్తారు. అందుకే వారు ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఉండి ముక్తిని పొందారు.

వెన్నెముక సమస్యలకు..

ఎప్పుడైతే మానవుల వెన్నెముక నిటారుగా ఉంచుతారో.. దాని తర్వాత మానవుల ఆలోచన శక్తి మరింత వేగంగా పెరుగుతుందట. అయితే శివరాత్రి రోజున భూమి ఊర్ధ్వ శక్తి పనిచేయడం నిద్రపోకుండా కూర్చోని కానీ నిలబడి కానీ ఉండటం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెపుతుంటారు. అందుకే చాలామంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.