Diwali 2024: దీపావళికి ఈ వస్తువులు కొంటే అష్టైశ్వర్యాలు మీ వెంటే..

|

Oct 30, 2024 | 1:44 PM

దీపావళి పండుగ రోజున చాలా మంది బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కొంటూ ఉంటారు. ఇలా కొనడం వల్ల వారి అభివృద్ధి పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు తీరాతయాని, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని అంటారు. బంగారం, వెండి వస్తువులు కొనలేని వారు ఈ వస్తువులు కొన్నా మంచిది.

Diwali 2024: దీపావళికి ఈ వస్తువులు కొంటే అష్టైశ్వర్యాలు మీ వెంటే..
Diwali 2024
Follow us on

దీపావళి పండుగ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన ఈ పండుగను జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ అంట ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. పిండి పదార్థాలు తింటూ ఎంతో సంతోషంగా టపాసులు కాల్చుతూ ఉంటారు. దీపావళి రోజున ఏ ఇంట్లో చూసినా దీపాలు ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటాయి. రంగు రంగుల ముగ్గులతో వాకిళ్లు అందంగా కనిపిస్తాయి. అయితే దీపావళి పండుగ రోజున కొన్ని రకాల వస్తువులు ఇంటికి కొని తీసుకొస్తే చాలా మంచిదని అంటారు. సాధారణంగా ఈ పండుగకు ఎక్కువగా బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అంత స్థోమత లేని వాళ్లు ఇప్పుడు చెప్పే వస్తువుల్లో ఏదైనా ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఇలా కొన్ని రకాల వస్తువులను కొని తీసుకు రావడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఎలాంటి వస్తువులు కొని తీసుకు రావాలి? ఏ వస్తువులు తీసుకు రావడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం – వెండి:

దీపావళి పండుగ రోజు బంగారం లేదా వెండి ఆభరణాలను కొని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. ఇలా కొనడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

శంఖం:

దీపావళి పండుగ రోజున దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకు రావడం వలన మంచి జరుగుతుందట. ఇందులో కుంకుమ కలిపిన బియ్యాన్ని వేసి.. ఉత్తర దిక్కులో పెడితే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది.

పసుపు:

ఈ పండుగ రోజున పసుపు ఇంటికి కొని తీసుకొస్తే చాలా మంచిదట. దీపావళి రోజున పసుపు మాత్రమే కాకుండా పసుపు కొమ్ములు కూడా కొనవవచ్చు. పసుపు కొమ్ములను పూజలో ఉంచి పూజ చేస్తే.. మీరు చేసే వ్యాపారంలో శ్రేయస్సు లభిస్తుంది.

తమల పాకులు:

తమల పాకులను కూడా దీపావళి పండుగ రోజున ఇంటికి కొని తీసుకు రావచ్చు. తమల పాకులు అంటే లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమే. కాబట్టి ఆమే ఆశీస్సులు లభిస్తాయి.

విగ్రహాలు:

దీపావళి పండుగ రోజున లక్ష్మీ దేవి, వినాయకుడు, కుబేరుడు, ఆవు దూడ వంటి బొమ్మలు కొని ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతే కాకుండా తామర పువ్వులు, మట్టి ప్రమిదలు, గోమతి చక్రం కొన్నా మంచిదే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..