IRCTC: తక్కువ ధరతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే..

| Edited By: Ravi Kiran

Feb 22, 2022 | 7:15 AM

IRCTC Tirupati Tour: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ అందిస్తోంది.

IRCTC: తక్కువ ధరతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే..
Tirumala
Follow us on

IRCTC Tirupati Tour: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ అందిస్తోంది. గోవిందం టూర్‌ పేరుతో అందించే ఈ ప్యాకేజీలో శ్రీవారి ప్రత్యేక దర్శనం (Tirumala Special Entry Darshanam) తో పాటు తిరుచానూర్‌ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ ధర కేవలం రూ.3, 690 మాత్రమే. ప్రతిరోజూ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 2-3 రోజుల పాటు తిరుమల వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ టూర్‌ ప్యాకేజీ వివరాలేంటో ఓ సారి చూద్దాం రండి. మూడు రోజులు, రెండు రాత్రుల సాగే ఈ టూర్ ప్యాకేజీలో ట్రైన్‌ ద్వారా పర్యాటకులను తిరుపతికి తీసుకెళుతుంది ఐఆర్‌సీటీసీ. మొదటి రోజు టూర్ లింగంపల్లి స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది. 12734 నంబర్ గల రైలును లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు, సికింద్రాబాద్‌లో 6.10 గంటలకు, నల్గొండలో రాత్రి 7.38 గంటలకు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తెల్లవారుజామున 5.55 గంటల కల్లా తిరుపతి చేరుకుంటారు.

తిరుపతిలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత నేరుగా తిరుమలకు తీసుకెళ్తారు. అక్కడ ఉదయం 8.30 గంటలకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలోని హోటల్‌కు తీసుకెళ్తారు. లంచ్అక్కడే ఉంటుంది. ఆపై తిరుచానూర్‌లోని పద్మావతీ ఆలయానికి తీసుకెళ్తారు. అమ్మవారి దర్శనం తర్వాత సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6.25 గంటలకు 12733 నంబర్ గల రైలు ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లి రైలు చేరుకుంటుంది. ఇక ఐఆర్‌సీటీసీ టూరిజం గోవిందం టూర్ ప్యాకేజీ ధరలను పరిశీలిస్తే.. ఇందులో స్టాండర్డ్‌, కంఫర్ట్‌ పేరుతో రెండు రకాల ప్యాకేజీ ధరలున్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,690, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,770, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.4,510. ఇక కంఫర్ట్ ప్యాకేజీ ధరలవిషయానికొస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,540, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,630, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,370. ఈ టూర్ ప్యాకేజీ సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా 8287932228, 8287932229, 8287932230, 8287932231, 9701360701 నంబర్లను సంప్రదించవచ్చు.

Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..

Lalu Prasad Yadav: బీజేపీని ఎదిరించినందుకే లాలూపై తప్పుడు కేసులు.. న్యాయపోరాటం చేస్తామంటున్న తనయుడు తేజస్వి..

Punjab Elections: స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రాబడిని రాజకీయాలు ఇస్తాయా? పంజాబ్ ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు ఏం చెబుతున్నాయి?