IRCTC Special Tour: అతి తక్కువ ధరలకే దేశంలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపించేదుకు భారతీయ రైల్వే ‘భారత్ దర్శన్’ పేరుతో ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశంలోని పలు రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కరోనాతో ఈ ట్రైన్లకు బ్రేకులు పడ్డాయి. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో.. మరలా ఈ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే ప్లాన్ చేసింది. ఈమేరకు ఆగస్టు 24 నుంచి భారత్ దర్శన్ పేరుతో మరో ప్రత్యేక ట్రైన్‌ను నడపనుంది. ఈ ట్రైన్ ఓంకారేశ్వర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, షిర్డీ, భీమాశంకర్ తోపాటు గ్రీష్నీశ్వర్, కేవాడియా లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక రైలును తిప్పుతున్నట్లు పేర్కొంది. పర్యాటకులు ఏడు జ్యోతిర్లింగాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించవచ్చని, ఆగస్టు చివరి వారంలో మొదలయ్యే ఈ ట్రైన్ రెండు వారాలపాటు పలు ప్రదేశాలకు తీసుకెళ్తుందని భారతీయ రైల్వే పేర్కొంది. ఆగస్టు 24న ప్రారంభమయ్యే ఈ ట్రైన్ సెప్టెంబర్ 7న తిరిగి వస్తుంది.
ఈ ట్రైన్‌లో పర్యటించాలకున్న ప్రయాణికులు లక్నో, గోరఖ్ పూర్, డియోరియా, వారణాసి, జౌన్‌పూర్ సిటీ, సుల్తాన్‌పూర్, కాన్పూర్, ఝాన్సీ లాంటి ప్రధాన నగరాల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అయితే ఈ ట్రైన్ తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మాత్రం అందుబాటులో లేదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రధాన నగరం నుంచి బుకింగ్ సదుపాయం కూడా కల్పించలేదు. ఒకవేళ ఈ ట్రైన్‌లో వెళ్లాలనుకుంటే బుకింగ్ ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలి.
భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీ ఖర్చు..
రెండు వారాల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్యాకేజీ ధర ఒక్కో ప్రయాణికుడికి రూ .12,285 గా ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఓంకారేశ్వర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, త్రయంబకేశ్వర్, షిర్డీ, భీమాశంకర్, గ్రీష్నీశ్వర్, కేవాడియాకు లాంటి ప్రముఖ ప్రదేశాల మీదుగా వెళ్తుందని పేర్కొంది.
ఈ సమయంలో ప్రయాణికులకు మూడు సార్లు శాఖాహారం అందిచనున్నారు. అలాగే ధర్మశాలలోని నాన్ ఏసీ వసతి ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, ప్రముఖ ప్రాంతాలను చూసేందుకు బస్సులు లేదా ఇతర వాహనాలను ఏర్పాటు చేయనుంది.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
భారత్ దర్శన్‌లో పర్యటించాలనుకున్న ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ www.irctctourism.com నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటితోపాటు హెల్ప్‌లైన్ నంబర్లు – 8287930908, 8287930909, 8287930910, 8287930911 నంబర్లకు కాల్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Also Read: