IRCTC: మీరు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

|

Dec 01, 2021 | 12:22 PM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో టెంపుల్ రన్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా పలు ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు...

IRCTC: మీరు తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
Irctc
Follow us on

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో టెంపుల్ రన్ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీ పద్మనాభస్వామి ఆలయం, రామేశ్వరం ఆలయం, మీనాక్షి ఆలయం, శ్రీరంగం ఆలయం, బృహదీశ్వర ఆలయం, మరిన్నింటితో సహా దక్షిణ భారతదేశంలోని ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాల వేళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ విషయాన్ని ఐఆర్‎సీటీసీ ట్విట్టర్ ద్వార వెల్లడించింది. పూర్తి వివరాలకు www.irctctourism.com వెబ్‎సైట్ సందర్శించాలని తెలిపింది.

కొద్ది రోజుల క్రితం IRCTC గుజరాత్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ టూరిజం ప్యాకేజీని ప్రారంభించింది. ” హరి హర దర్శన్ విత్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ” రైలు డిసెంబర్ 10న మధురై నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ పర్యటనలో బెంగళూరు, తుమకూరు, అర్సికెరె, దావణగెరె, హుబ్బల్లి, బెలగావిలలో బోర్డింగ్ పాయింట్లు ఉన్నాయి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ టూర్ కోసం LTCని పొందవచ్చని IRCTC తెలిపింది.


Read Also… Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్, ట్రాన్స్‎పోర్టు, ట్రీట్‎మెంట్ కట్.. ఎక్కడంటే..