Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 30 నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు.. అన్ని ఆర్జిత‌ సేవలు రద్దు

విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ,అందంగా ముస్తాబు కానుంది. అంతేకాదు కనకదుర్గమ్మకు సుప్రభాతం సేవ, స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నారు

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 30 నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు.. అన్ని ఆర్జిత‌ సేవలు రద్దు
Kanaka Durga Temple

Edited By:

Updated on: Aug 10, 2023 | 9:03 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోవాలు జరుగనున్నాయి. ఈ నెల ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 తేదీ వరకు మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్ర మాల ధారణ చేశారు. అనంతరం దుర్గమ్మను భక్తులు దర్శించుకోవడానికి ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతినిస్తారు.

విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ,అందంగా ముస్తాబు కానుంది. అంతేకాదు కనకదుర్గమ్మకు సుప్రభాతం సేవ, స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజున అమ్మవారి దర్శనాన్ని ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంది.

మూడో రోజైన సెప్టెంబరు 1న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత‌ సేవలనూ రద్దు చేస్తారు. అమ్మవారికి దేవస్థాన అర్చకులు నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us