పూర్వీకులకు నివాళులు అర్పించడానికి, వారికి శాంతిని అందించడానికి ఇందిరా ఏకాదశి తిథి ఒక ప్రత్యేక సందర్భం. ఏకాదశి తిథి రోజున దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మహా విష్ణువు అనుగ్రహంతో పూర్వీకులకు ఈ రోజున దానాలు చేసిన ఫలాలు నేరుగా అందుతాయని నమ్మకం. ఈ ఏకాదశి రోజున చేసే దానం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు వ్యక్తి సంపదను పొందుతాడు. అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందుతాడు.
పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 7.42 నుంచి 09.12 గంటల వరకు పూజలకు అనుకూలం.
ఇందిరా ఏకాదశి తిథిన దానం చేసేటప్పుడు మనస్సులో ఎలాంటి అత్యాశ, అహంకారం ఉండకూడదు. అంతేకాదు దానం చేసే సమయంలో పూర్వీకుల పేరుని ప్రార్థిస్తూ ఉండాలి. దానం చేసే సమయంలో ముఖంలో చిరునవ్వు, ఆనందం ఉండాలి. నవ్వుతూ దానం చేయాలి. మనసులో ఎలాంటి భేదభావాలు ఉండకూడదు. ఇలా చేసే దానాలతో ప్రజలు తమ పూర్వీకుల నుంచి ఆశీస్సులు పొంది జీవితంలో సుఖశాంతులు పొందుతారు. అంతేకాదు అన్ని రకాల దుఃఖాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి