Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్‌ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..

|

Apr 17, 2022 | 9:07 AM

మంచిర్యాలజిల్లాలో ప్రాణహిత పుష్కరాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఐదో రోజు పుష్కరాలకు నదీ తీరాలు భక్తిభావంతో పరవశిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు..

Pranahita Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు.. పార్కింగ్‌ ఫీజుల పేరుతో మొదలైన వసూళ్ల దందా..
Pranahita Pushkaralu
Follow us on

మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత పుష్కరాలకు(Pranahita Pushkaralu) భక్తుల తాకిడి పెరిగింది. ఐదో రోజు పుష్కరాలకు నదీ తీరాలు భక్తిభావంతో పరవశిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద పుణ్యస్నానాలతోపాటు పితృదేవతలకు తర్పణాలు పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. స్థానికులతోపాటు ఏపీలోని గుంటూరు, తూర్పుగోదావరి కాకినాడ, తెనాలి, రాయలసీమ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు ప్రాణహిత పుష్కరాల్లో కూడా అధికారుల చేతివాటం తప్పడం లేదు. పుష్కరస్నానానికి వచ్చిన భక్తుల నుండి పార్కింగ్ పేరిట డబ్బులు వసూలు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట పుష్కర ఘాట్‌లో కారుకు 50 రూపాయలు, బస్సుకు వంద, బైక్‌కి 20, ఆటోకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం లేదా స్థానిక గ్రామ పంచాయతీ నుంచి టెండర్ వేసి వసూలు చేయాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు.

పుష్కరాల్లో ఎలాంటి వసతులు కల్పించకున్నా.. కొందరు గ్యాంగ్‌గా ఏర్పడి వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవలని డిమాండ్ చేస్తున్నారు. వసూళ్ల దందాను అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు