Vastu Tips : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం

| Edited By: Phani CH

Apr 22, 2023 | 9:00 AM

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా ముఖ్యమైనవి. సూర్యాస్తమయం సమయంలో ఈ 6 పనులు చేస్తే ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.

Vastu Tips : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి సిరులు కురిపించడం ఖాయం
Vastu Tips
Follow us on

ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు నెలకొనేందుకు చాలా మంది అనేక చర్యలు తీసుకుంటారు. హిందూ మతం విశ్వాసాల మతంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రాముఖ్యత గురించి జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. హిందూ మతం ప్రకారం, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కొన్ని చేయకూడని పనులుంటే…కొన్ని చేసే పనులు ఉన్నాయి. ఈ రోజు మనం సూర్యాస్తమయంలో చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం.

సూర్యాస్తమయం సమయంలో ఈ పని చేయండి:

ఇంట్లో దీపాలు వెలిగించాలి:

సూర్యాస్తమయం సమయంలో, ఇంట్లో ఏ మూల కూడా చీకటిగా ఉండకూడదు. ఇలా చేయడం వల్ల సుఖం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లోని ప్రతి మూలలో వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్వీకులకు నమస్కరించండి:

సూర్యాస్తమయ సమయంలో పూర్వీకులకు నమస్కరించడం ముఖ్యం. ఈ సమయంలో పూర్వీకుల ముందు దీపం వెలిగించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని నమ్మకం. మనలను కూడా ఆశీర్వదిస్తాడు. దీని వల్ల మనం అన్ని సమస్యల నుండి బయటపడతాము.

సూర్యునికి నమస్కరించండి:

సూర్యాస్తమయ సమయంలో సూర్యభగవానునికి నమస్కారం చేయడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సూర్యాస్తమయ సమయంలో సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి.

పూజా గదిలో దీపం వెలిగించండి:

సూర్యాస్తమయ సమయంలో పూజా మందిరంలో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్మకం. దీంతో ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదన్నారు.

ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు:

సూర్యాస్తమయం సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రాకూడదని అంటారు. ఇలా చేయడంతో లక్ష్మీదేవికి వస్తుంది. అందుకే మీరు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి వెళ్లినప్పుడు, పండ్లు, కూరగాయాలు, ఆహారా ధాన్యాలు ఏవైనా సరే తీసుకెళ్లాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)