Krishna on Kaliyug: పురాణాలు హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నేటి మానవుడి జీవన విధానానికి మార్గాన్ని నిర్ధేశిస్తాయి. అటువంటి మహాగ్రంథం శ్రీమద్భాగవతం. సకల వేదాంత సారంగా చెప్పబడిన ద్వాపర యుగం అనంతరం కలియుగంలో మనిషి తీరు జీవన విధానం గురించి ఒక కథ ఉంది.. దీనిని శ్రీకృష్ణుడుని అర్జున, భీమ, నకుల, సహదేవులు కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు సమాధానంగా కలియుగంలో మనిషి నడుచుకునే విధానం గురించి సవివరంగా తెలిపారు..
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. అర్జున, భీమ, నకుల, సహదేవులు మీ నలుగురు నాలుగు బాణాలను నాలుగు దిక్కులకు సంధించండి… ఆ బాణాలను వెదుకుతూ వెళ్లి.. తిరిగి తీసుకుని రండి.. అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దీంతో నలుగురు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తేవడానికి .. తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అది చూసి అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.
భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. నలుగురూ తిరిగి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి.. తాము బాణాలు పడిన ప్రాంతంలో చూసిన సంఘటనలు వివరిస్తూ.. తమ సందేహాలు అడిగారు.
దీంతో శ్రీకృష్ణుడు వారి సందేహాలకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ముందుగా అర్జునుడి చూసిన సంఘటనను వివరిస్తూ.. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారని చెప్పాడు.. ఇక భీముడి చూసిన దానిగురించి తెలుపుతూ.. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరని వివరించాడు. ఇక నకులుడు చూసిన సంఘటనను వివరిస్తూ.. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారని తెలిపాడు.. చివరిగా సహదేవుడు చూసిన సంఘటనను వివరిస్తూ.. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. అయితే అదే సమయంలో ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో.. వారిని భగవన్నామమనే చిన్న మొక్క కాపాడుతుందని చెప్పాడు శ్రీకృష్ణుడు.
Also Read: Minister KTR: మరోసారి మంచిమనసును చాటుకున్న మంత్రి కేటీఆర్.. రోడ్డు యాక్సిండెంట్ బాధితులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలింపు