Tirupati: తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్.. సర్వదర్శనానికి 20 గంటలు..

|

May 31, 2024 | 11:41 AM

స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో కుర్చుని ఎదురుచూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు ఏకంగా క్యూలైన్‌ కృష్ణతేజ గెస్ట్‌హౌస్ మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం వరకూ భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది  పడకుండా ఆహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

Tirupati: తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్.. సర్వదర్శనానికి 20 గంటలు..
Tirumala Rush
Follow us on

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పర్యాటక ప్రాంతాల్లో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ అన్యూహంగా పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో కుర్చుని ఎదురుచూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు ఏకంగా క్యూలైన్‌ కృష్ణతేజ గెస్ట్‌హౌస్ మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం వరకూ భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది  పడకుండా ఆహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల టికెట్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. గురువారం సర్వదర్శనం క్యూలైన్ లోకి భక్తులను టీటీడీ అనుమతించ లేదు.  ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనం చేసుకొనే భక్తులకు క్యూలైన్ లోకి అనుమతినిచ్చారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటుగా మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాదకేంద్రం, లేపాక్షి సర్కిల్‌, బస్టాండ్‌ ఇలా కొండ మీద ఇసుక వేస్తే నేల రాలదు అన్నచందంగా ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో  భక్తులు కనిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా గురువారం శ్రీవారిని 64, 115 మంది భక్తులు దర్శించుకున్నారు.  32, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి రూ. 4. 23 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..