Horoscope 1st March: కొన్ని సందర్భాల్లో మనకు అవసరం లేని విషయాల్లో కూడా తల దూర్చడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. మరికొన్నిసార్లు ముందు వెనుక ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటి నిర్ణయాల వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసర ఉంది. ముఖ్యంగా పలు రాశుల వారికి ఈ రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూసేయండి..
శ్రీశార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, కృష్ణపక్షం; తిథి: విదియ ఉ. 8.36, తదియ తె. 5.47 వరకు; నక్షత్రం: ఉత్తర ఉ. 7.37, హస్త తె. 5.32 వరకు; వర్జ్యం: మ.3.17-4.45; దుర్ముహూర్తం: మ.12.52-1.38, మ.3.12-3.58; అమృతఘడియలు: రా.12.03-1.31; రాహుకాలం: ఉ.7.30-9.00; సూర్యోదయం: 6.38; సూర్యాస్తమయం: 6.19
మేషం: ఈ రాశి వారు ఇవాళ చేపట్టినటువంటి పనుల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతికి ఉండ్రాలు నివేదన చేసుకోవటం మంచింది.
వృషభరాశి: ఈ రాశి వారు ఈ రోజు వేరు వేరు రూపాల్లో ఆలోచనలు చేస్తుంటారు. వాటిని కార్యరూపం దాల్చేందుకు తగినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవటం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య సంబంధిత విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అలాగే మీరు ఉపయోగిస్తున్న వాహనాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. నందీశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు సహకారంతో కూడినటువంటి లాభాలు, లేదా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు దిగ్విజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మందార పుష్పాలతో సూర్యగ్రహాన్ని పూజించటం మంచిది.
సింహ రాశి: ఈ రాశివారు అనుకోనటువంటి ప్రయోజనాలు పొందేందుకు తగినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ రాశి వారు మహాలక్ష్మిని ఆరాధించడం మేలు చేస్తుంది.
కన్యా రాశి : ఈ రాశివారు ఇవాళ ముఖ్యమైనటువంటి అవకాశాలు పొందేటుటవంటి క్రమంలో కష్టపడవలసిన అవసరం కనిపిస్తుంది. శ్రమకు గురి అయితే కానీ అనుకున్నటువంటి విజయాలను సాధించుకోలేరు. వేరు వేరు రూపాల్లో పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.
తుల రాశి: ఈ రాశి వారికి మానసికమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు అందివచ్చిన సహకారాన్ని సరిగా వినియోగించలేకపోతారు. అందివచ్చిన అవకాశాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టలక్ష్మీ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి వేరు వేరు రూపాల్లో ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. నవగ్రవ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపార సంబంధిత విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నమ్మిన సిద్ధాంతాలను అవలంభిస్తుంటారు. దుర్గాదేవి ఆరాధన వీరికి మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. శ్రమకు గురవుతుంటారు. జాగ్రత్తలు తీసుకోవవాల్సిన అవసరం ఉంది. సుదర్శన స్వామి వారి నామస్మరణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
Also read: