Holi 2022: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా చేసుకుంటారు. అయితే, జ్యోతిష్యం ప్రకారం ఈసారి హోలీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈసారి గ్రహాలు, రాశుల స్థానాన్ని అనుసరించి మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అరుదైన యోగం మునుపెన్నడూ లేదని పండితులు చెబుతున్నారు. ఈ మూడు రాజయోగాలు చాలా పవిత్రమైనవిగా పేర్కొంటున్నారు. ఈ మూడు యోగాలు గౌరవం, కుటుంబ ఆనందం, శ్రేయస్సు, పురోగతి, కీర్తిని ఇస్తాయట. హోలికా దహనం మార్చి 17న అంటే ఈరోజు రాత్రి జరుపుతారు. ఈ దహన సమయంలో కొన్ని జ్యోతిష్య నివారణలు పాటిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా దంపతుల జీవితం సుఖమయం అవుతుందని చెబుతున్నారు. మరి ఆ జ్యోతిష్య చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వైవాహిక జీవితంలో కష్టాలను తగ్గించుకోవడానికి..
మీ వైవాహిక జీవితం అంతా సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే.. హోలికా దహనం రోజు రాత్రి ఉత్తరం వైపు ఒక ప్లేట్ పెట్టి, దానిపై తెల్లటి గుడ్డ కప్పాలి. పగడం, శనగపప్పు, బియ్యం, గోధుమలు, కందిపప్పు, నల్ల ఉరద్, నువ్వుల సహాయంతో ఆ తెల్ల గుడ్డపై నవగ్రహాలను ప్రతిష్టించాలి. ఆ తర్వాత ఆ నవగ్రహాలకు పూజ చేసి కుంకుమ తిలకం పెట్టాలి. దీపం వద్దకు వెళ్లి ఆది దంపతులైన పరమ శివుడు, పార్వతీ దేవిలను పూజించాలి. ఈ సమయంలో, జీవితంలో వచ్చే సమస్యలను తొలగించమని దేవతలను ప్రార్థించండి. భార్యాభర్తలు కలిసి చేసే ఈ పూజ వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.
వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేయడానికి..
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మూడు ఎండు కొబ్బరి కాయలు తీసుకోవాలి. వాటితో భర్త తన భార్యను 7 సార్లు కొట్టి, ఆ కొబ్బరికాయలను మంటల్లో వేయాలి. ఆ తరువాత హోళికా దహనం చుట్టూ భార్యభర్తలు ఇద్దరూ 7సార్ల ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితంలోని కష్టాలు తొలగిపోయి.. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని విశ్వాసం.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి..
లక్షల ప్రయత్నాలు చేసినా ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడకపోతే ఇలా చేయాలని సూచిస్తున్నారు వేద పండితులు. హోలికా దహనం రోజు రాత్రి భార్యాభర్తలు పళ్లెం తీసుకుని చంద్రుడి వెలుగులో నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తరువాత చంద్రునికి పాలు నైవేద్యంగా పెట్టి, ధూపం లేదా అగరబత్తులతో హారతి ఇవ్వాలి. పౌర్ణమి రాత్రి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాజనితమైనది. జ్యోతిష్య శాస్త్రాలు, పండితుల అభిప్రాయం ప్రకారం వివరాలను పేర్కొనడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనికి టీవీ9తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదు.
Also read:
The Godfather: ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదరే.. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ మూవీ
IPL 2022: విరాట్ కోహ్లీని ఎంఎస్ ధోనీ దాటేస్తాడా.. అభిమానులు ఏమనుకుంటున్నారు..
Drugs Supply: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు హెరాయిన్.. అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు