
హిందూ మతంలో మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. దీని ప్రకారం కొన్ని రోజులు తల స్నానం చేయడం శుభప్రదం కాగా మరి కొన్ని రోజులు అశుభకరంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకాలు సాంప్రదాయకమైనవి. వివిధ ప్రాంతాలు, కుటుంబాలకు అనుగుణంగా మారవచ్చు. కొంతమంది ఈ ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తారు. మరికొందరు వాటిని అస్సలు పట్టించుకోరు. అవసరం లేదా పరిశుభ్రత వంటి వివిధ కారణాల వలన వ్యక్తులు ఏ రోజు అయినా తల స్నానం చేయడానికి ఎంచుకోవచ్చు. ఈ నమ్మకాలు అసౌకర్యం లేదా బాధ కలిగించినప్పుడు వాటిని కఠినంగా అనుసరించడం కంటే.. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత, జ్యోతిషశాస్త్ర సందర్భాన్ని అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం ముఖ్యం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ఈ నమ్మకాల ప్రకారం వివాహిత స్త్రీలు ప్రతిరోజూ తల స్నానం చేయరాదు. వివాహిత స్త్రీలు మంగళవారం, గురువారం , శనివారం వంటి కొన్ని రోజులలో తల స్నానం చేయడం నిషేధించబడింది. అయితే సోమవారం, శుక్రవారం, ఆదివారం వివాహిత స్త్రీలు తల స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
పండుగలు రోజులలో మహిళలు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కొన్నిసందర్భాల్లో ఇలా చేయకపోవడం భర్త వయస్సు,ఆర్ధిక పురోగతిని ప్రభావితం చేస్తుందని కూడా ప్రస్తావించబడింది. కనుక మహిళలు తల స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని మతపరమైన నియమాలను తెలుసుకుందాం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు