Kumbh Mela 2021 : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా మొదలు, ఉదయాన్నే పూర్తయిన నాగాసాధువుల స్నానం

|

Mar 11, 2021 | 4:22 PM

Kumbh Mela 2021 : కుంభమేళా పోటెత్తింది. హరిద్వార్‌ పునీతమైంది. ఆధ్యాత్మికతతో ఓలలాడింది. పుణ్యస్నానాలతో గంగా నది పులకించిపోయింది. సాధువుల పూజలు.. భక్తజనం సందడితో హరిద్వార్‌ కళకళలాడింది. ఉత్తరాఖండ్‌లోని..

Kumbh Mela 2021 : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా మొదలు, ఉదయాన్నే పూర్తయిన నాగాసాధువుల స్నానం
Follow us on

Kumbh Mela 2021 : కుంభమేళా పోటెత్తింది. హరిద్వార్‌ పునీతమైంది. ఆధ్యాత్మికతతో ఓలలాడింది. పుణ్యస్నానాలతో గంగా నది పులకించిపోయింది. సాధువుల పూజలు.. భక్తజనం సందడితో హరిద్వార్‌ కళకళలాడింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా పుణ్యస్నానాలు ఇవాళ మొదలయ్యాయి. జూనా అఖాడా, ఆహ్వాన్ అఖాడా, అగ్ని అఖాడా, కిన్నర్ అఖాడాలు ఇక్కడ స్నానం చేసేందుకు ఉదయమే తరలివచ్చారు. ఆనంద్ అఖాడాలు సైతం రావడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. నాగా సాధువుల స్నానం ఇప్పటికే పూర్తయింది.

మరోవైపు పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ భక్తులు సైతం భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పడు ఘాట్‌లను శుభ్రం చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించి భక్తులు వస్తున్న దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేసి పర్యవేక్షకుల్ని నియమించారు. భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళా జరుగుతున్న చోట.. కరోనా నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మరోవైపు.. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు శివాలయాల్లో క్యూ కట్టారు. లింగ రూపంలో ఉన్న శివుడిని దర్శించుకుంటున్నారు.

Read also : West Bengal Elections : బెంగాల్‌లో బీజేపీ – టీఎంసీ మధ్య బిగ్ ఫైట్‌, డిశ్చార్జి తర్వాతే మ్యానిఫెస్టో, హాస్పిటల్ నుంచి మమత వీడియో అప్పీల్