
Hanuman Puja Benefits: హిందూ మతంలో ప్రతీ వారానికి ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన దేవతకు అంకితం చేయబడి ఉంటుంది. హిందూ సంప్రదాయంలో మంగళవారం హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శౌర్యం, భక్తి, బ్రహ్మచర్యం, అపారమైన బలానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధించడం వల్ల అనేక ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక లాభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మంగళవారం గ్రహాధిపతి కుజుడు (మంగళ గ్రహం). ఈ గ్రహం శక్తి, ధైర్యం, రక్తసంబంధిత సమస్యలు, కోపం వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. హనుమంతుడు కుజగ్రహానికి అధిదేవతగా భావించబడతాడు. అందుకే మంగళవారం హనుమంతుని భక్తితో ఆరాధిస్తే కుజదోషాలు శాంతిస్తాయని నమ్మకం.
మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడంతోపాటు
హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠనం వల్ల మనస్సు స్థిరపడుతుంది. భయాలు, అనవసర ఆలోచనలు దూరమవుతాయి.
హనుమంతుడు అపారమైన శక్తికి ప్రతీక. ఆయనను ఆరాధించేవారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వివాహ అడ్డంకులు, రుణబాధలు, ఉద్యోగ సమస్యలు వంటి కుజదోష ప్రభావాలు మంగళవారం హనుమంతుని సేవతో తగ్గుతాయి.
మంగళవారం హనుమంతుడి ఆరాధనతో గ్రహపీడలు తొలగిపోతాయి. గ్రహపీడలు, దుష్టశక్తుల ప్రభావం నుంచి హనుమంతుని నామస్మరణ రక్షణ కలిగిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు.
పోటీ పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార ప్రారంభం ముందు హనుమంతుని ప్రార్థన అనుకూల ఫలితాలు ఇస్తుందని నమ్మకం.
తెల్లవారుజామునే స్నానం చేసి ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించడం
హనుమంతునికి సింధూరం, ఎర్ర పుష్పాలు సమర్పించడం
హనుమాన్ చాలీసాను 11 లేదా 21 సార్లు పఠించడం
శనివారంలా నూనె దీపం కాకుండా నెయ్యి దీపం వెలిగించడం
ఉపవాసం లేదా ఫలాహారం చేయడం మరింత శుభఫలితం ఇస్తుంది.
హనుమంతుని ఆరాధన కేవలం కోరికల సాధన మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, సేవాభావం, భక్తి మార్గంలో నడవడం. మంగళవారం హనుమంతుని నామస్మరణ చేస్తే జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మికులు చెబుతున్నారు. “శ్రీరామదూతం శిరసా నమామి” భక్తితో పలికితే అంతులేని శక్తి మీ వెంట నడుస్తుంది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.)