Tirumala: ఈనెల 16న తిరుమలలోని ఆకాశగంగ వద్ద హనుమాన్ జన్మస్థలం భూమి పూజ.. హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కం విడుద‌ల

Tirumala: తిరుమలలోని అంజనాద్రి(Anjanadri)లో హనుమంతుని జన్మస్థలానికి(Hanuman birthplace) భూమి పూజను ఈ నెల 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఆకాశ‌గంగ..

Tirumala: ఈనెల 16న తిరుమలలోని ఆకాశగంగ వద్ద హనుమాన్ జన్మస్థలం భూమి పూజ.. హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కం విడుద‌ల
3
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2022 | 9:06 AM

Tirumala: తిరుమలలోని అంజనాద్రి(Anjanadri)లో హనుమంతుని జన్మస్థలానికి(Hanuman birthplace) భూమి పూజను ఈ నెల 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భూమి పూజ ఏర్పాట్ల‌ను ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. తిరుమల ఆకాశగంగ లో హనుమంతుని జన్మ స్థలం చోట టిటిడి నిర్మించబోతున్న నిర్మాణాలు డిజైన్ మ్యాప్ ని టిటిడీ అధికారులు రిలేజ్ చేశారు.

తిరుమల ఆకాశ గంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయ‌స్వామివారి జన్మస్థల‌మ‌ని భౌగోళిక, పౌరాణిక‌, శాస్త్రీయంగా ఆధారాలతో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రకటించింద‌న్నారు ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి . ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టిటిడి ఫిబ్రవరి 16న భూమిపూజ నిర్వహించనున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కం విడుద‌ల చేస్తామ‌న్నారు.

అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం ఎదురుగా ముఖ మండ‌పం, గోపురాలు, గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద రోట‌రీ దాత‌ల స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తామ‌న్నారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ ముర‌ళీ కృష్ణ ఆర్ధిక స‌హ‌యంతో ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ శ్రీ ఆనంద సాయి ఆధ్వర్యంలో నిర్మాణాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు.

విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామ‌జ‌న్మ భూమి ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వ‌ర‌ శ‌ర్మ‌ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి పాల్గొన‌నున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కొర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 9.30 గంట‌ల నుండి ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

Also Read:

 ఇవాళ విశాఖకు సీఎం వైఎస్ జగన్.. శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలకు హాజరు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!