
పురాణాల్లో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీ దేవి జన్మించింది. హిందూ మత గ్రంథాలలో లక్ష్మీ దేవిని సిరి సంపదలకు అధిదేవతగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించడం, ఉపవాసం ఉండటం నియమాల ప్రకారం చేయాల్సి ఉంటుంది. హిందువుల నమ్మకం ప్రకారం, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఇంట్లో ధన, ధాన్యాలకు కొరత ఉండదు. ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. అందుకనే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ విషయం గురించి అందరికీ తెలుసు. అయితే శుక్రవారం గుప్తలక్ష్మిని పూజిస్తారని మీకు తెలుసా. నిజానికి గుప్త లక్ష్మిని ధూమావతి అని, అష్ట లక్ష్మి అని కూడా పిలుస్తారు. శుక్రవారం రోజున గుప్త లక్ష్మి (అష్ట లక్ష్మి) ని పూజించే వారి ఇంటి ఖజానా ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉంటుందని నమ్మకం.
హిందూ మతంలో లక్ష్మీ దేవిని ఇంట్లో ధన ధాన్యాలకు, సిరి సంపదలను అందించే దేవతగా మాత్రమే కాదు సుఖ సంతోషాలను అందించే దైవంగా కూడా పూజిస్తారు. గుప్త లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా నశిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు