Srisailam Mallanna Channel: ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత చేరువయ్యేందుకు చర్యలు చేపట్టింది. ఇకనుంచి శ్రీశైలం మల్లన్న (Srisailam Mallanna) పూజా కార్యక్రమాలు భక్తులకు మరింత చేరువకానున్నాయి. ఇందుకోసం కీలక చర్యలు చేపట్టింది దేవస్థానం. ఇప్పటివరకు భక్తులు శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ద్వారా ప్రస్తుతం కార్యక్రమాలను వీక్షించేవారు. ఇక ఇప్పటి నుంచి దేవస్థానం వారు నిర్వహించే నిత్య కార్యక్రమాలు, NXT ద్వారా కూడా టీవీలల్లో దేశవ్యాప్తంగా ప్రసారం కానునున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సర్వీస్‌ను లాంఛనంగా ప్రారంభించారు హిందుజా గ్రూప్, NXT డిజిటల్ ప్రతినిధి శ్రీకుమార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 66వ నెంబర్‌లో శ్రీశైలం టీవీ ప్రసారం కానుంది.
ఇక మల్లన్న భక్తులకు మరో శుభవార్త చెప్పారు ఆలయ ఈవో లవన్న. 21వ తేది వరకు భక్తులకు సర్వ దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. 5 రోజుల పాటు స్పర్శ దర్శనాలు కొనసాగనున్నాయి. 22వ తేది నుంచి వచ్చేనేల 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వ దర్శనాలు రద్దు చేస్తామని ఈవో చెప్పారు. అటు అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను ఇవాళ్టి నుంచే భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు శీశైలం ఆలయం ఈవో లవన్న.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీశైలంలో ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఈవో లవన్న అధికారులతో బుధవారం సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: