Andhra Pradesh: కార్తీకమాసం వేళ తూర్పుగోదావరిలో వింత ఘటన.. కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తులు

|

Nov 22, 2022 | 11:19 AM

దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు.. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసం వేళ ఉమ్మడి  తూర్పుగోదావరి జిలాల్లో వింత సంఘటన చోటు చేసుకుంది

Andhra Pradesh: కార్తీకమాసం వేళ తూర్పుగోదావరిలో వింత ఘటన.. కళ్లు తెరిచిన లక్ష్మీదేవి విగ్రహం.. బారులు తీరిన భక్తులు
Godess Lakshmi devi Idol
Follow us on

సనాతన హిందూ ధర్మానికి నెలవు భారత దేశం. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు.. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలను రుజువుగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో పవిత్ర కార్తీక మాసం వేళ ఉమ్మడి  తూర్పుగోదావరి జిలాల్లో వింత సంఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అంతరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Reporter: Krishna, TV9 Telugu

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..