Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి అందిన గోదా మాలలు.. అంగరంగ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి పరిణయోత్సవ వేడుకలు..

గోదాదేవిమాలలు తిరుపతి నుంచి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ‌ర్‌స్వామివారి మఠానికి మంగళ వారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు.

Tirumala Tirupati: తిరుమల శ్రీవారికి అందిన గోదా మాలలు.. అంగరంగ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి పరిణయోత్సవ వేడుకలు..
Goda Devi Malas

Edited By:

Updated on: Jan 16, 2024 | 6:13 PM

తిరుమల శ్రీవారికి మహా భక్తురాలైన శ్రీ గోదాదేవి (ఆండాళ్‌ అమ్మవారు) పరిణయోత్సవం సందర్భంగా గోదామాలలు శ్రీవారి మూలవిరాట్‌కు అలంకరించారు. మంగళవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి.

Goda Devi Malas

గోదాదేవిమాలలు తిరుపతి నుంచి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ‌ర్‌స్వామివారి మఠానికి మంగళ వారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.

Goda Devi Malas

ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియ‌ర్‌ స్వామి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..