Garuda Puranam: ఈ 5 విషయాలను పాటిస్తే.. బాధల నుంచి విముక్తి పొందొచ్చు.!

|

Oct 10, 2021 | 8:26 AM

సనాతన ధర్మంలో 18 పురాణాలు ప్రస్తావించబడ్డాయి. ఈ 18 పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఇది యాగం, దానం, తపస్సు...

Garuda Puranam: ఈ 5 విషయాలను పాటిస్తే.. బాధల నుంచి విముక్తి పొందొచ్చు.!
Garuda Puranam
Follow us on

సనాతన ధర్మంలో 18 పురాణాలు ప్రస్తావించబడ్డాయి. ఈ 18 పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఇది యాగం, దానం, తపస్సు, తీర్థయాత్రలు మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. అలాగే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి అవసరమయ్యే అన్ని నియమాలు గరుడ పురాణంలో ఉన్నాయి. మరణించిన తర్వాత ఆత్మ యమలోక ప్రయాణాన్ని గరుడ పురాణం వివరిస్తుంది. ఇక వీటన్నింటి ఉద్దేశ్యం ఒకటే.. ఓ వ్యక్తి ధర్మాన్ని ఎన్నుకుని సరైన మార్గంలో పయనిస్తే.. తప్పు, ఒప్పు మధ్య తేడాను గుర్తించగలడు. తద్వారా తన జీవితాన్ని మెరుగుపరుచుకోగలడు. అలాగే మరణానంతరం మోక్షాన్ని సైతం పొందగలడు. మీ జీవితంలో బాధల నుంచి విముక్తి పొందాలంటే.. ఈ 5 విషయాలను ఖచ్చితంగా పాటించాలని గరుడ పురాణం పేర్కొంటోంది. అవేంటో తెలుసుకుందాం పదండి..

కుటుంబ చిహ్నం(Totem)…

గరుడ పురాణం ప్రకారం, మీ 7 తరాలు దేవతలు ప్రసన్నమైతేనే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి మీ టోటెమ్‌(Totem)ని ఎప్పుడూ అగౌరవపరచవద్దు. దానికి ప్రత్యేక తేదీలలో పూజలు జరపండి.

లేఖనాలు చదవండి…

ఓ వ్యక్తి అధర్మ మార్గంలో పయనించకుండా ఆపడానికి, అలాగే అతడికి సరైన మార్గాన్ని చూపించడానికి లేఖనాలు ఎల్లప్పుడూ పనిచేస్తాయి. మార్గం సరిగ్గా ఉంటేనే భవిష్యత్తు కూడా బాగుంటుంది. అందువల్ల, ప్రతిరోజూ కొంత సమయం లేఖనాలు చదవండి.

ఆహారాన్ని దానం చేయండి…

అన్ని దానాలలో కంటే అన్నదానం గొప్పదని అంటారు. నిస్వార్థంగా ఆహారాన్ని దానం చేసే వ్యక్తికి దేవతల నుంచి మాత్రమే కాకుండా తన పూర్వీకుల నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాంటి కుటుంబంలో ఏడు తరాలూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాయి.

దేవుడిని ప్రార్ధించండి…

ఏదైనా తినే ముందు దాన్ని దేవుడికి పెడితే అది ప్రసాదం అవుతుంది. అందువల్ల ప్రతీరోజూ ఆహారం మొదలగు వాటిని దేవుడికి అర్పించిన తర్వాతే ఆరగించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆహారం వృథా అవ్వదు. అలాగే లక్ష్మీదేవి కృప కూడా మనపై ఉంటుంది. ఇక లక్ష్మీదేవి ఆశీస్సులు లభించే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ఉంటాయి.

చింతన…

ఆలోచించడం మంచిదే. సరైన ఆలోచనలతోనే మనం వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు కోసం ఖచ్చితమైన వ్యూహాలను రూపొందించవచ్చు. అలాగే సవాళ్లను సైతం ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. ధ్యానం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ ప్రచురితమైనది)