Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఏ పనులు చేస్తే జీవితంలో విజయం సాధిస్తారో తెలుసా..

హిందూ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణానికి అధినేత శ్రీ మహా విష్ణువు. ఈ గరుడ పురాణంలో మనిషి జీవన విధానం, మంచి, చెడు పనులు వలన కలిగే ఫలితాలు.. మరణం అనంతరం ఆత్మ చేసే ప్రయాణాన్ని స్వయంగా విష్ణువు తన భక్తుడైన గరుత్మండికి స్వయంగా చెప్పాడు. నరకం శిక్షల గురించి మాత్రమే కాదు మనిషి భూమి మీద జీవించి ఉన్నంతకాలం చేయాల్సిన పనులు.. ఏ పనులు చేయడం వలన జీవితంలో విజయం సాధిస్తారో కూడా వెల్లడించాడు

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఏ పనులు చేస్తే జీవితంలో విజయం సాధిస్తారో తెలుసా..
Garuda Puran

Updated on: May 28, 2025 | 4:17 PM

సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువు, అతని వాహనమైన గరుత్మండికి మధ్య జరిగిన సంభాషణను వివరంగా వివరిస్తుంది. గరుడ పురాణం లో మనిషికి మంచి చెడుల మధ్య తేడాలని వివరిస్తూ అనేక రకాల బోధనలు లభిస్తాయి. ఇందులో జీవితం, మరణం, మరణం తరువాత అన్ని పరిస్థితులు వివరించబడ్డాయి. అంతేకాదు గరుడ పురాణంలో మనిషి జీవించి ఉన్నప్పుడు ఎలా నడచుకుంటే మరణాంతరం ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో కూడా చెప్పింది. ఇక భూమి మీద ఏపనులు చేయడం వలన మనిషి విజయం సొంతం అవుతోందో కూడా వివరించింది. ఎవరైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వీటిని అవలంబించవచ్చు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలనుకుంటే.. గరుడ పురాణంలోని ఈ బోధనలను ఖచ్చితంగా స్వీకరించండి. గరుడ పురాణంలో ప్రస్తావించబడిన జీవితానికి సంబంధించిన కొన్ని మర్మమైన విషయాల గురించి తెలుసుకుందాం. వీటిని పాటించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు…

ఏకాదశి ఉపవాసం

తిధుల్లో ఏకాదశి తిధికి విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు పురాణాలలో ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదిగా వర్ణించబడింది. అంతేకాదు ఏకాదశి వైభవం గురించి గరుడ పురాణంలో కూడా వివరంగా వర్ణించబడింది. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని కష్టాల నుంచి రక్షించబడతాడని.. జీవితంలో సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం.

రోజూ శుభ్రమైన బట్టలను ధరించండి

కొంతమంది బట్టలను రోజుల తరబడి ధరిస్తారు. ఇలా మురికి బట్టలు ధరించడం మంచిది కాదని.. అది దరిద్రాన్ని తీసుకుని వస్తుంది. ఎవరైనా జీవితంలో ధనవంతులుగా లేదా.. డబ్బులకు ఇబ్బంది లేకుండా జీవించాలని అనుకుంటే రోజూ శుభ్రమైన దుస్తులు ధరించండి. గరుణ పురాణం ప్రకారం మురికి బట్టలు ధరించే వారి జీవితం ఎప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అక్కడ పేదరికం నివసిస్తుంది. కనుక ఏరోజుకారోజు శుభ్రమైన బట్టలు ధరించాలి. మురికి బట్టలను దరించవద్దు.

అందరి దేవుళ్ళను గౌరవించండి

హిందూ మతంలో కోట్లాది మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది తమ దేవుడు గొప్ప అంటే తమ దేవుడు గొప్ప అంటూ వాదించుకుంటూ ఉంటారు. ఇతర దేవతలను లేదా దేవుడిని అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడట. కనుక దేవుళ్ళందరూ ఒకటే అని అందరికీ గౌరవించండి.

తులసి మొక్క లేని ఇల్లు

తులసి మొక్కను విష్ణు ప్రియ అని కూడా అంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. సిరి సంపదలతో తుల తూగుతుంది. తులసి మొక్క ప్రాముఖ్యతను గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలలో వర్ణించారు. తులసి మొక్క లేని ఇల్లు దారిద్ర దేవత నివాసం అని నమ్మకం. తులసి మొక్క ఆధ్యాత్మికత పరిమళాలను మాత్రమే కాదు తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు