Ganesh Immersion: భాగ్యనగరంలో నిమజ్జనోత్సవం సందడి నెలకొంది. ఓ వైపు నగరంలో కురుస్తున్న వర్షం.. మరోవైపు వినాయక విగ్రహాల ఊరేగింపు.. ఇంకోవైపు బుజ్జి గణపయ్యల నిమజ్జనంతో ట్యాంక్ బండ్ కొత్త శోభ సంతరించుకుంది. నవరాత్రులు పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మహా నగరంలోని గణపయ్యల నిమజ్జనానికి ఆదివారం నుంచి బయలుదేరారు. వివిధ ప్రాంతాల్లోని గణేశులు గంగమ్మ ఒడిలో చేరేందుకు శోభాయాత్రగా వస్తూనే ఉన్నారు. ఇంకా భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది.
నగరంలోని జంట నగరాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో గణేష్ శోభాయాత్ర నెమ్మదిగా కొనసాగుతుంది. దీంతో అబిడ్స్ వరకు క్యూలో వినాయక విగ్రహాలున్నాయి. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంక్‌బండ్‌పై వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా భారీ అలంకరణతో వినాయక విగ్రహాలను తీసుకొచ్చి క్రేన్‌ల సాయంతో సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా నిమజ్జనత్సోవంలో పాల్గొంటున్నారు.
ఇక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. గణేష్ శోభాయాత్ర ముగిసే వరకు నగరంలో ట్రాఫిక్ఆంక్షలను పొడిగించారు. అంతేకాదు రైల్వే శాఖ ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతుంది. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు.
Also Read: Bhishma Niti: ఉన్నత పదవులను దుర్మార్గులకు ఇస్తే ఏ విధమైన పరిమాణాలు ఏర్పడతాయో భీష్ముడు చెప్పిన కథ..