
పాకిస్థాన్ లోని హిందువులు ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చే సమయంలో కరాచీ వీధుల్లో ఒక ఆటో మీద పెట్టి వైభవంగా ఊరేగిస్తూ తీసుకుని వెళ్తున్నారు. ఇలా గణపయ్య తన తల్లి ఒడిలో చేరేందుకు వెళ్తున్న సమయంలో వీధిలో ఉన్నవారిని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంటే… నిమజ్జనం కోసం ఆటోలో తీసుకెళ్తున్న సన్నివేశాన్ని పాకిస్థానీ ముస్లింలు నోరు ఎల్లబెట్టి మరీ చూస్తున్నారు. భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అని జపిస్తూ సాంప్రదాయ ధోల్ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కదా ధర్మం శాశ్వతమైన జ్వాలను సజీవంగా ఉంచడం. ఆ వినాయకుడు మీ అందరికీ బలం, ధైర్యాన్ని ప్రసాదించుగాక అని ఒకరు..
పాకిస్థాన్ గడ్డపై వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారంటే వాళ్లు చాలా గ్రేట్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మైనారిటీ హిందూ సమాజాలు కరాచీలో గణేష్ వేడుకలను ఐక్యంగా జరుపుకున్నాయి. దీనితో పాకిస్తాన్‌లోని హిందూ సమాజం గణపతి పండుగను దాని అన్ని సంప్రదాయాలు, నిలబెట్టినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
2023 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లో దాదాపు 5.2 మిలియన్ల మంది హిందువులు ఉన్నారు. ప్రధానంగా సింధ్‌లో (8.8%). ప్రధానంగా కరాచీలో మరాఠీ మాట్లాడే జనాభా 500 నుంచి 3,000 వరకు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..