Ganesh Chaturthi: గరికతో వినాయకుడిని పూజిస్తే.. ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు..!

|

Sep 10, 2021 | 10:38 AM

Ganesh Chaturthi: ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే ముందుగా..

Ganesh Chaturthi: గరికతో వినాయకుడిని పూజిస్తే.. ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు..!
Follow us on

Ganesh Chaturthi: ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే ముందుగా గణపతిని పూజించాలి. అలాంటి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. గరికలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా దాగివున్నాయి. దేవతా మూలికగా పేరున్న గరికలో తొమ్మిది రకాలున్నాయట. అందులో వినాయకుడి కోసం ఉపయోగించే గరిక ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గరికతో పాటు, గన్నేరు పువ్వులతో వినాయక చతుర్థి రోజున వినాయకుడి పూజకు ఉపయోగించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. తెలుపు గన్నేరు పువ్వులతో ఉదయం పూట వినాయకుడికి, శివుడికి అర్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అర్చక పుష్పం అని సంస్కృతంలో పిలువబడే గరిక ద్వారా విఘ్నేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయని వేదపండితులు చెబుతున్నారు. గరిక సూర్యునికి కూడా ప్రీతికరం కావడంతో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.

గరికతో పూజిస్తే కష్టాలు తొలగుతాయి..

అంతేకాకుండా.. గణనాధుడికి గరిక పూజ చేస్తే శనీశ్వరుడిచే కలిగే కష్ట నష్టాల నుంచి బయటపడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. అదీ వినాయక చతుర్థీ రోజున గరిక పూజతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు.

గరికతో వినాయకుడినే కాదు..దుర్గాదేవిని కూడా..

గరిక పత్రంతో వినాయకుడినే కాదు…దుర్గాదేవిని పూజిస్తే ప్రార్థనలు ఫలిస్తాయి. ఈ పత్రాన్ని బీరువాల్లో, నగదు ఉంచే ప్రాంతంలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. రావలసిన ధనం చేతికి అందుతుంది. గరికమాలను విఘ్నేశ్వరునికి సమర్పించుకుని అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయక చతుర్థీ రోజున 21 రకాల పత్రులతో పూజ చేసినా అన్నింటికంటే ముఖ్యమైనది. వినాయకుడికి ఎంతగానో నచ్చింది దూర్వార పత్రం. దీనినే గరిక అంటారు. దీనితో పూజ చేసే వారికి గణపతి అనుగ్రహం లభిస్తుందని పండితులు అంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Ganesh Chaturthi: గరిక అంటే వినాయకుడికి ఎందుకు ఇష్టం..? గరిక లేనిది గణపతికి లోటేనట..!

Vinayaka Chaviti: వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే ఏమవుతుంది..! ఎందుకు చూడకూడదు